1 నేనొక్కడినే సినిమా కోసం పెద్ద సాహసం చేసిన మహేష్... అయినా ఫలితం లేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.ఇక మహేష్ బాబు సినిమాలకు ఎంతో మంచి క్రేజ్ ఉంది.

 Sukumar Interesting Comments On Mahesh Babu1 Nenokkadine Movie Details,mahesh Ba-TeluguStop.com

మహేష్ బాబు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అలాంటి సినిమాల్లో ఖ‌లేజా, 1 నేనొక్క‌డినే సినిమాలుంటాయి.

ముఖ్యంగా సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే( 1 Nenokkadine ) సినిమా విషయానికి వస్తే…ఈ సినిమా చాలా రిచ్ గా, డిఫరెంట్ గా ఉంటుంది.మ‌హేష్ లుక్స్, మ‌హేష్ కొడుకు గౌత‌మ్ క్యామియో, సుకుమార్ స్క్రీన్ ప్లే, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆ సినిమాకు స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డేలా చేసింది.

Telugu Nenokkadine, Sukumar, Mahesh Babu, Maheshbabu-Latest News - Telugu

ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేకపోయింది.ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడటమే కాకుండా పెద్ద ఎత్తున రిస్క్ కూడా చేశారు అంటూ ఇటీవల సుకుమార్ తెలిపారు.ఈ సినిమాలో ఒక సన్నివేషంలో విల‌న్ గ్యాంగ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి మ‌హేష్ బాబు  స్పీడ్ బోట్ తీసుకుని స‌ముద్రంలోకి వెళ్తాడు.మ‌హేష్ ను వెంబ‌డిస్తూ మరికొంద‌రు కూడా అత‌న్ని ఫాలో అవుతుంటారు.

Telugu Nenokkadine, Sukumar, Mahesh Babu, Maheshbabu-Latest News - Telugu

ఈ సన్నివేషంలో మహేష్ బాబు మినహా మిగిలిన వారందరూ కూడా ప్రొఫెషనల్ స్విమ్మర్స్.పైగా వారంతా కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని ఈ సన్నివేశంలో పాల్గొన్నారు.మహేష్ బాబు మాత్రం నార్మల్ డ్రెస్ లోనే ఉన్నారు.  ఆయనకు స్విమ్మింగ్ ( Swimming ) కూడా పెద్దగా రాదని, అయితే ప్రొఫెష‌న‌ల్ బోట్ డ్రైవ‌ర్ బోట్ ను ఎంత స్పీడ్‌తో డ్రైవ్ చేస్తాడో దాన్ని మ‌హేష్ అలానే డ్రైవ్  చేశాడని సుకుమార్ తెలిపారు.

ఇలా ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా రిస్క్ తీసుకుని పనిచేశారని ఆయనప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube