మయన్మార్‌లో( Myanmar ) నిజంగా అద్భుతం జరిగిపోయింది.కూలిపోతున్న బిల్డింగ్‌ల మధ్యలో ఒక తండ్రి తన భార్యని, కూతుర్ని కాపాడుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో( Bangkok ) జరిగింది.
అసలేం జరిగిందంటే.
మయన్మార్‌లో భారీ భూకంపం( Earthquake ) వచ్చింది.రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల 1,600 మందికి పైగా చనిపోయారు, వేల మంది గాయపడ్డారు.ఈ భూకంపం దెబ్బకి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ కూడా వణికిపోయింది.
జనాలు భయంతో పరుగులు తీశారు.
క్వాన్ యంగ్ జున్( Kwon Young Jun ) అనే వ్యక్తి బ్యాంకాక్‌లోని పార్క్ ఒరిజిన్ థాంగ్లోర్ అనే అపార్ట్‌మెంట్‌లో 52వ అంతస్తులో ఉన్నాడు.
భూకంపం రావడంతో బిల్డింగ్ మొత్తం ఊగిపోవడం మొదలైంది.ఒక్కసారిగా బిల్డింగ్‌లో కొన్ని భాగాలు కూలిపోతూ కనిపించాయి.
రెండు టవర్లను కలుపుతూ 600 అడుగుల పొడవైన నడకదారి ఒక్కసారిగా పగిలిపోయింది.తన భార్య సుకన్య యుటువామ్, చిన్న పాప మరో బిల్డింగ్‌లో ఉండటంతో క్వాన్ యంగ్ జున్ కి ఏం చేయాలో అర్థం కాలేదు.
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి, కుప్పకూలిన నడకదారిపై నుంచి దూకి అవతలి బిల్డింగ్‌కి చేరుకున్నాడు.
అదృష్టవశాత్తూ, క్వాన్ యంగ్ జున్ భార్య, కూతురు అప్పటికే బిల్డింగ్ నుంచి బయటికి వచ్చేసి సురక్షితంగా ఉన్నారు.ఆ తర్వాత క్వాన్ యంగ్ జున్ కూడా 40 అంతస్తులు దిగి కిందకు వచ్చి తన భార్య, కూతుర్ని కలుసుకున్నాడు.ఈ సాహసంలో అతనికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి, కానీ అతను చేసిన పని మాత్రం చాలా ప్రమాదకరమైనది.అతని భార్య సుకన్య యుటువామ్ మాట్లాడుతూ.“నేను సరైన వ్యక్తినే ఎంచుకున్నాను” అంటూ తన భర్త చేసిన పనిని స్వచ్ఛమైన ప్రేమ, ధైర్యంతో కూడుకున్న చర్య అని మెచ్చుకుంది.
ఈ భూకంపం మయన్మార్‌లో భారీ విధ్వంసం సృష్టించింది.చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి, రోడ్లన్నీ తెగిపోయాయి.సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.గాయపడిన వాళ్లతో హాస్పిటల్స్ నిండిపోయాయి, వేల మంది నిరాశ్రయులయ్యారు.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద భూకంపం రావడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.థాయ్‌లాండ్ అధికారులు బ్యాంకాక్‌లోని భవనాలను, ముఖ్యంగా ఎత్తైన బిల్డింగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్వాన్ యంగ్ జున్ చేసిన ఈ సాహసం ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది.
ఇంత భయంకరమైన సమయంలో అతను చూపించిన ధైర్యం, వేగంగా ఆలోచించే గుణం, భార్యాపిల్లలపై ప్రేమ, నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు.క్వాన్ యంగ్ జున్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.