యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా తర్వాత ఈయనకు పాన్ ఇండియా స్టార్ అని మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రం వార్ 2( War 2 ), సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మరో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ రెండు పూర్తి కాగానే ఈయన దేవర2లో కూడా బిజీ కాబోతున్నారు.ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు ఎన్టీఆర్ కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఇక వార్ 2 సినిమాలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఎన్టీఆర్ తన కోస్టార్ గా నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అదే విధంగా ఎన్టీఆర్ నటించిన సినిమాల గురించి కూడా ఆయన పలు విషయాలను తెలిపారు ఎన్టీఆర్ నటించిన సినిమాలలో తనకు జనతా గ్యారేజ్ ( Janatha Garage ) సినిమా అంటే చాలా ఇష్టం అని తెలిపారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని ఆ సినిమాని నేను చేసుంటే బాగుండేదని హృతిక్ రోషన్ పలు సందర్భాలలో భావించారట.
హృతిక్ రోషన్ లాంటి గొప్ప నటుడు ఎన్టీఆర్ ని పొగడడం ఆయనతో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పడం ఎన్టీఆర్ అభిమానులను ఎంతో సంతోషానికి గురి చేస్తుంది.