టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ త్వరలోనే డైరెక్టర్ అట్లీతో కలిసి సినిమా మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి పని.కాగా ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే.ఇటు అల్లు అర్జున్(Allu arjun), అటు అట్లీ (Atlee)ఇద్దరు కూడా కెరియర్లో మంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు.ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంబోలో ఒక మూవీ పడడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరాయి.
వీరిద్దరి కాంబో మూవీ గురించి చెబుతూ ఒక చిన్న వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఆ చిన్న వీడియోలో చెప్పింది చాలా వుంది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.సినిమాకు సీజీ పనులు చాలా వున్నాయి.అందుకే వెల్ ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట మొదలైందట.ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్ల అవసరం వుందట.ఎవరి పాత్ర ఎంత మేరకు, ఎవరు మెయిన్ హీరోయిన్, మిగిలిన ఇద్దరికి ఏ మేరకు పాత్రలు వుంటాయి ఇలాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ఇందులోఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరైతే బాగుంటుంది అనే కన్నా, ఎవరైతే డేట్ లు అవైలబుల్ గా ఉంటాయి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ బడ్జెట్ ను వీలయినంత వేగంగా తీయాల్సి ఉందట.ఎందుకంటే సిజి వర్క్(CG work) లు అన్నీ విదేశీ సంస్థల్లో చేయించాల్సి ఉంది.కానీ దానికి చాలా టైమ్ పడుతుందట.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి మిగతా ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అన్నది చూడాలి మరి.ఇకపోతే హీరో అల్లు అర్జున్ విషయానికి వస్తే.ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 (Allu Arjun Pushpa 2)మూవీతో మరో సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.పాన్ ఇండియా స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.