ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.59
సూర్యాస్తమయం: సాయంత్రం.6.34
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ఉ.10.14 ల10.44 సా5.14 ల5.26
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12
మేషం:

ఈరోజు దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభం:

ఈరోజు ధన పరంగా లోటు ఉండదు.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి.వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుతుంది.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మిథునం:

ఈరోజు బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో స్ధిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు.వ్యాపారమున ఆలోచనలు కలసి వస్తాయి.ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.
కర్కాటకం:

ఈరోజు వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
సింహం:

ఈరోజు సోదర వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి.ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేస్తారు.
కన్య:

ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.మొండి బాకీలు వసూలవుతాయి.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
తుల:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఇంటాబయట ఋణ ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
వృశ్చికం:

ఈరోజు గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.స్ధిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు.గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి.
భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు:

ఈరోజు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రం సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు.వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు.
మకరం:

ఈరోజు ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు.బంధు మిత్రుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
కుంభం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.పాత మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మీనం:

ఈరోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు.శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.