వేసవి తాపం)(Summer heat) భరించలేక చాలామంది చల్లటి ప్రదేశాలకు చెక్కేస్తున్నారు.సోషల్ మీడియాలో లోయల్లో పారుతున్న నదులు, మంచుకొండలతో(rivers , icebergs) వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి అందమైన సీన్లు చూసి టూరిస్టులు వేలల్లో క్యూ కడుతున్నారు.కానీ చాలామంది ఒక విషయం మర్చిపోతున్నారు.
ఈ అందమైన ప్రదేశాలకు చేరుకోవడం అంత తేలిక కాదు.గుండెలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాలి.
ఎందుకంటే అక్కడి రోడ్లు అలా ఉంటాయి మరి.సన్నగా, వంకరలు తిరుగుతూ, ప్రమాదకరంగా ఉంటాయి.
అందుకే హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) వాళ్ళు ఈ రూట్లలో బస్సులు నడుపుతారు.వాళ్ల డ్రైవర్లు మామూలోళ్లు కాదు, మహా నిపుణులు.ఎలాంటి కష్టమైన రోడ్డునైనా అవలీలగా డ్రైవ్ చేస్తారు.బస్సు ఎంత వెడల్పు ఉంటుందో, రోడ్డు కూడా అంతే వెడల్పు ఉంటుంది.
అయినా సరే సూపర్ స్కిల్స్‌తో బస్సుని నడిపేస్తారు.అందుకే వాళ్ల డ్రైవింగ్ వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.
ఇప్పుడు కూడా ఒక వీడియో హల్ చల్ చేస్తోంది.ఆ రోడ్లు ఎంత కష్టంగా ఉంటాయో, డ్రైవర్లు ఎంత టాలెంటెడో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.

వీడియో స్టార్ట్ అవ్వగానే ఒక HRTC బస్సు రెండు పెద్ద రాళ్ల మధ్య నుండి ఇరుకు దారిలో వెళ్తూ ఉంటుంది.డ్రైవర్ ఎంత స్లోగా, ఎంత జాగ్రత్తగా బస్సుని తిప్పుతున్నాడో చూడండి.రాళ్లకు తగలకుండా డ్రైవ్ చేస్తున్నాడు.రోడ్డు కూడా ఏమంత బాగా లేదు.కొన్ని చోట్ల గుంతలు కొన్ని చోట్ల నీళ్లు పారుతున్నాయి.అయినా డ్రైవర్ మాత్రం అస్సలు ఆగకుండా బస్సుని పోనిస్తున్నాడు.

బస్సు (BUS)ముందుకు వెళ్తున్న కొద్దీ రోడ్డు పక్కన లోయ, మరోవైపు మంచు దుప్పటి కప్పిన కొండలు, అబ్బో వ్యూ అయితే అదిరిపోతుంది.కానీ రోడ్డు మాత్రం చాలా రిస్క్ గా ఉంది.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవ్ చేయాల్సిందే.ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.ఇప్పుడు వైరల్ అయిపోయింది.చాలామంది చూస్తున్నారు.2.51 లక్షల వ్యూస్, 16 వేల లైక్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు.కామెంట్స్ లో నెటిజన్లు డ్రైవర్ టాలెంట్ ని పొగుడుతున్నారు.ఆ లొకేషన్ ఎంత బాగుందో అని కామెంట్స్ పెడుతున్నారు.నిజంగానే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.ప్రశాంతమైన కొండల అందం వెనుక ఎంత కష్టం ఉందో, HRTC డ్రైవర్లు లాంటి నిజమైన హీరోలు వల్లే మనం సేఫ్ గా జర్నీ చేయగలుగుతున్నాం.
వాళ్లకి హాట్సాఫ్ చెప్పాల్సిందే.







