ప్రస్తుతం ఈ వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక అనారోగ్య సమస్య చుట్టుముట్టేస్తుంది.ఇక పొరపాటున వర్షంలో తడిచామా జలుబు, దగ్గు వంటి సమస్యలకు తోడు గొంతు నొప్పి కూడా బాగా ఇబ్బంది పెడుతుంది.
ఈ గొంతు నొప్పి కారణంగా చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.తినాలన్నా, మాట్లాడాలన్నా ఎంతో బాధాకరంగా ఉంటుంది.
ఒక్కోసారి గొంతు నొప్పి వల్ల రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టదు.దాంతో పెయిన్ కిల్లర్స్ ను మింగేస్తుంటారు.
అయితే ఇటువంటి మాత్రలు తాత్కాలికంగా నొప్పి నుండి ఉపశమనాన్ని అందించినా.మన ఆరోగ్యంపై అవి చెడు ప్రభావాన్ని చూపుతాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే ఒక్క రాత్రిలో గొంతు నొప్పి ( Sore throat )నుంచి ఉపశమనం పొందవచ్చు.పైగా ఈ టిప్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.పుదీనా టీ.గొంతు నొప్పి నుంచి చక్కటి ఉపశమనాన్ని అందిస్తుంది.చాలా త్వరగా నొప్పిని నివారిస్తుంది.
అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి.అలాగే 10 ఫ్రెష్ పుదీనా ఆకులు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి( Pepper powder ) వేసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టీను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజుకు రెండుసార్లు ఈ పుదీనా టీ తాగితే గొంతు నొప్పి దెబ్బకు ఎగిరిపోతుంది.

అలాగే గొంతు నొప్పితో విలవిల్లాడిపోతున్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలుపుకుని సేవించాలి.ఇలా చేస్తే యాపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ గొంతు నొప్పిని తరిమి కొడతాయి.రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయిఇక దాల్చిన చెక్క బాదం పాలు కూడా గొంతు నొప్పి నుండి త్వరగా బయటపడడానికి సహాయపడతాయి.ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక చిన్న కప్పు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఒక గ్లాసు బాదం పాలు పోసి ఒక నిమిషం పాటు హీట్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ పాలల్లో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి.ఈ దాల్చిన చెక్క బాదంపాలు తీసుకున్న సరే గొంతు నొప్పి నుంచి ఈజీగా బయటపడొచ్చు.