గోప్రో కెమెరాను దొంగిలించిన సింహం.. తరువాత ఎలాంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయో చూస్తే...!

ఇటీవల 38 ఏళ్ల ఫొటోగ్రాఫర్ అహ్మద్ గలాల్ కెన్యా అడవిలోని సింహాన్ని చాలా దగ్గరగా వీడియో తీయాలనుకున్నాడు.అదే ఆశతో గోప్రో కెమెరాను ఓ స్టిక్‌కు అటాచ్ చేసి ఉంచాడు.

 The Lion Who Stole The Gopro Camera What Kind Of Scenes Were Recorded Later, Li-TeluguStop.com

కొద్ది సేపటికి సదరు కెమెరా ముందుకు ఒక లేడీ లయన్ వచ్చింది.దాంతో దాని ముఖం, దంతాల అద్భుతమైన దృశ్యాలు గోప్రో కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఈ ఆడ సింహానికి స్టిక్‌కు అటాచ్ చేసిన ఆ గోప్రో కెమెరా ఇంటరెస్టింగ్గా అనిపించినట్లు ఉంది.అందుకే అది దానిని దొంగిలించి దానితో పారిపోయింది.

ఆ సమయంలో సింహం అడవిలో పరుగెత్తుతున్న దృశ్యాన్ని కెమెరా రికార్డు చేసింది.అది కెమెరా పట్టుకుని పరిగెడుతుండగా మధ్యలో కెమెరా కింద పడింది.

కాగా సింహం దానిని మళ్లీ నోట కరచుకుంది.ఫోటోగ్రాఫర్ వాహనం దగ్గరకు రాగానే సింహం కెమెరాను కింద పడేసింది.

ఆపై అక్కడినుంచి వెళ్లి పోయింది.కెమెరాపై స్క్రాచ్ మార్క్స్ పడ్డాయి కానీ అది పాడు కాలేదు.

బాగానే పని చేసింది.

సింహం నోట్లో పెట్టుకోవడం, కింద పడేయడం వంటివి చేసిన తర్వాత కూడా కెమెరా పని చేయడంతో అహ్మద్‌ ఊపిరి పీల్చుకున్నాడు.కెమెరా పాడై పోతుందేమోనని తాను ఆందోళన చెందానని, అలా జరగక పోవడం తన అదృష్టం అని చెప్పాడు.అంతిమంగా సింహానికి సంబంధించిన ఇంత ప్రత్యేకమైన ఫుటేజీని తీయగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని అతను చెప్పాడు.

గోప్రో కెమెరాతో ఆడ సింహం పారిపోతున్న వీడియో వైరల్‌గా మారింది.దీనిని @yourclipss అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు చూసారు.అద్భుతమైన వన్యప్రాణుల దృశ్యాలను క్యాప్చర్ చేయడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.

సింహాలు ఎంత ఉత్సుకతతో ఉల్లాసంగా ఉంటాయో కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube