భారత దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.వీటిలోని కొన్ని దేవాలయాలలో వింతలు, రహస్యాలు, విశేషాలు ఉన్నాయి.
ఈ దేవాలయాలలోని కొన్ని రహస్యాలను మానవ మీద మెదడు, సైన్స్ కూడా చెదించలేకపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంత టెక్నాలజీ వచ్చిన కొన్ని ఆలయాలలోని రహస్యాలను ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు.
ఈ సందర్భంలో ఈరోజు మనం ఎన్నో రహస్యాలు, వింతలను దాచుకున్న ఒక దేవాలయం గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ దేవాలయాన్ని కిరాడు దేవాలయం అని అక్కడి ప్రజలు పిలుస్తారు.
ఆ దేవాలయం నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది.ఒక అధ్యయనం ప్రకారం క్రీస్తుపూర్వం 1161 లో ఈ ప్రదేశం పేరు కిరాడు కు ఇది ఐదు దేవాలయాల సమూహం అని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.
ఇప్పుడు ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుని ఉంది. శివాలయం, విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉన్నా ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో ఇప్పటివరకు కచ్చితంగా సమాచారం లేదు.

800 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో ఈ దేవాలయానికి చేరుకున్నాడని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.ఒకరోజు ఆయన శిష్యులను దేవాలయంలో విడిచిపెట్టి తీర్థ యాత్రలకు వెళ్ళాడు.ఈ క్రమంలో ఒక శిష్యుడి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఇతర శిష్యులు గ్రామస్తుల నుంచి సాయం కోరారు.అయితే శిష్యులకు ఒక మహిళ మాత్రం సహాయం చేసిందని కూడా చెబుతూ ఉంటారు.
ఈ విషయం తెలుసుకున్న సన్యాసి కోపం వచ్చి సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారుతారని గ్రామస్తులను శపించాడని ఎక్కడ ప్రజలు భయపడుతూ ఉంటారు.అంతేకాకుండా తన శిష్యులకు సాయం చేసిన స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపొమ్మని వెనుతిరిగి చూడవద్దని చెప్పాడని కూడా చెబుతూ ఉంటారు.
అయితే ఆ మహిళ ఊరు విడిచి వెళ్లే సమయంలో ఏమి జరుగుతుందా అనే ఆసక్తితో వెలుగు తిరిగి చూడడం ప్రారంభించింది.ఫలితంగా ఆమె కూడా రాయి అయిపోయింది.
ఆ మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ ఊరిలోనే ఉంది.