చాలామంది ఇల్లు నిర్మించే సమయంలో అన్ని సవ్యంగా ఉండాలని చూసుకుంటూ ఉంటారు.ఈ సమయంలో ఏ చిన్న లోపం వచ్చినా కూడా ఇంటి వాస్తు దెబ్బతింటుంది.
అందుకే ఇంటి వాస్తు బాగుండాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు.దీనివలన ఇల్లు సురక్షితంగా ఉంటుంది.
అయితే ఇల్లు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కచ్చితంగా స్పష్టత ఉండాలి.అలాగే మన ఇంటికి ఎన్ని కిటికీలు అమర్చుకోవాలి అన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి.ఇక కిటికీలు ఎప్పటికీ కూడా సరి సంఖ్యలోనే ఉండాలి.
2,4,6,8,10 ఇలా సరి సంఖ్యలోనే కిటికీలు ఉండాలి.కిటికీలు( windows ) ఎప్పటికీ కూడా బేసి సంఖ్యలో ఉండకూడదు.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కిటికీల ఎంపిక చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.అందుకే కిటికీలు పెద్దగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి.అలాగే గాలి, వెలుతురు ధారాళంగా ఉండేటట్టు చూసుకోవాలి.
అయితే కిటికీలను ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలన్న అవగాహన కూడా కచ్చితంగా అవసరం.తూర్పు, ఉత్తర, పడమర( East, North, West ) దిశల్లో కిటికీలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
అలాగే దక్షిణ దిశలో యముడు ఉంటాడు.

అందువలన ఈ దిశలో కిటికీలు ఏర్పాటు చేసుకోవడం అంత మంచిది కాదు.ఇక తూర్పు దిశ సూర్యుడికి ( East direction sun )ఇష్టమైన దిక్కు.అందుకే ఈ దిశ వైపు అమర్చుకోవడం చాలా మంచిది.
దీని వలన మీకు మంచి ఫలితాలు ఉంటాయి.ఇక ఉత్తర దిశ కుబేర స్థానం కావడంతో ఈ దిశ వైపు కూడా కిటికీలు అమర్చుకోవడం చాలా మంచిది.
అంతే కాకుండా పడమర వైపు కూడా కిటికీలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది.అంతేకాకుండా మీకు గాలి కూడా బాగా తగులుతుంది.

అందుకే ఈ దిశ వైపు కిటికీలను అమర్చుకోవడం చాలా మేలు.ఇక అంతేకాకుండా కిటికీలు పాతవి ఉండకూడదు.విరుగినవి కూడా అస్సలు వాడకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం కిటికీలు వాస్తు పద్ధతులను పాటిస్తూ పెట్టుకుంటే మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.ఇక కిటికీలు తెరిచే సమయంలో శబ్దాలు కూడా రాకూడదు.శబ్దాలు వస్తే కష్టాలు వస్తాయి.
అందుకే కిటికీల ఎంపికలో పద్ధతులు పాటించి వాస్తు దోషాలను లేకుండా చూసుకోవాలి.
DEVOTIONAL