సర్వసంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి(Lakshmi Devi: ).ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే.
ఆ తల్లి అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.చాలామంది ఎంత కష్టపడి సంపాదించిన ఇంట్లో డబ్బు అసలు నిలవదు.
దీంతో అప్పులతో సతమతమవుతూ ఉంటారు.అయితే ఈ పరిస్థితికి కారణం లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే అని పండితులు చెబుతున్నారు.
అయితే సంపద, శ్రేయస్సు, శక్తి, సంతానోత్పత్తికి ప్రతీకగా నిలిచే దేవత లక్ష్మీదేవి అంటారు.ఆ దేవత అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అయితే లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని( Gayatri Mantra ) ప్రతిరోజు 108 సార్లు జపించడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ మంత్రాన్ని పటిస్తూ అమ్మవారిని పూజించడం వలన దరిద్రం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి.పూజ మందిరంలో లక్ష్మీదేవి పాద ముద్రలను గీయడం లేదా పాదముద్రికల పటాలను పెట్టి పూజలు చేయాలని చెబుతున్నారు.దీనివలన లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించి పాపాలు, శాపాలు అన్ని తొలగిపోతాయి.
ఇక సంపదలతో పాటు శాంతి కూడా ప్రార్థిస్తుందని అంటున్నారు.
అయితే తామర పువ్వులు( Lotus flowers ), కొబ్బరి, ఖీర్ లాంటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.ఇలా చేయడం వలన అమ్మవారి కటాక్షం లభిస్తుంది.లక్ష్మీదేవి తామర పువ్వులపై ఆసీనులై దర్శనమిస్తుంది.
అందుకు గాను తామర వత్తులను తయారుచేసి శుక్రవారాల్లో ఒక మట్టి ప్రమిదలో తొమ్మిది తామరవత్తులు, నెయ్యితో దీపం వెలిగించాలి.దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
శాస్త్రాల ప్రకారం తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.కాబట్టి ఇంట్లో ఉన్న తులసి మొక్క( Basil plant )కు విష్ణుమూర్తి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది.
అందుకే మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి.ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి నీరు సమర్పించి దీపం వెలిగించాలి.
అలాగే తులసిని ఇంటి ఈశాన్య దిశలోనే నాటాలి.దీంతో దేవి అనుగ్రహం లభించి కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఇంట్లో సముద్రపు గవ్వలను పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ముఖ్యంగా పూజ గదిలో శంఖం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంటి పూజ గదిలో శంఖాన్ని పవిత్ర స్థలంలో ఉంచాలి.ఇంట్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే ప్రతి రోజు సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించాలి.
అలాగే అందులో రెండు లవంగాలు వేయాలి.ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి.
ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
LATEST NEWS - TELUGU