విష్ణు మూర్తి ఆయుధము పాంచజ్యము ప్రాశస్త్యము ఏమిటి?

నీల మేఘ శ్యామ వర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచ ఆయుధములు ధరించిన వాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించిన వాడు, శ్రీదేవి, భూదేవి లచే కొలువబడుచున్నవాడు, శ్రీ వత్స చిహ్నమును, కౌస్తుభమును, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు, అలాగే చేతిలో శంఖు చక్రం పట్టుకొను వాడే శ్రీ మహా విష్ణువు అని మన పురామాలు చెబుతున్నాయి.అయితే శ్రీ మహా విష్ణువు అనగానే మనకు గుర్త వచ్చేది ఆయన ఆయుధం అయిన శంఖం.

 Story Of Vishnu Murthi Ayudham Panchajyam Details, Panchajyam, Shankam, Sri Maha-TeluguStop.com

ఈ విషయం మన అందరికీ తెలిసిందే.అలాగే భాగవత పురాణ కథలో దీని గురించి చాలా ప్రముఖంగా వివరించారు.

అయితే పంచజనుడనే రాక్షసుని శరీరములో బల రామకృష్ణుల గురువైన సాందీపుని పుత్రుడు ప్రభాస తీర్ధమున జలకాల ఆటలు ఆడుతున్నాడు.అయితే అప్పుడే ఒక కెరటము వానిని కొట్టగా సముద్రములోకి కొట్టుకుపోయి నీటిలో మునిగిపోగా పంచజనుడు మింగాడు.

సాందీపునికి గురు దక్షిణగా తన పుత్రుని కోరగా బలరామ కృష్ణులు సముద్రుని వద్దకు వెళ్ళి గురు పుత్రుని ఇమ్మని కోరాడు.ప్రభాస తీర్ధమున ఉన్న పాంచజన్యుడు మింగాడని సముద్రుడు చెప్పగా ప్రభాస తీర్ధములో దిగి పంచజనుడ్ని చూసి వానితో పోరాడి చీల్చివేసాడు.

అందున్న శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకుని యమపురికి వెళ్ళి ఆ శంఖాన్ని ఊదాడు.ఆ నాదానికి ఉలిక్కి పడిన యమధర్మ రాజు శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలుసు కుని సాందీపుని పుత్రుని ఇచ్చి పంపించాడని శ్రీ మహా భాగవతములో చెప్పబడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube