ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు లేదా పూజాకార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎన్నో ఆచారవ్యవహారాలను నియమాలను పాటిస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఈ క్రమంలోనే ఏదైనా పవిత్రంగా పూజ చేసేటప్పుడు శుభకార్యాలు చేసేటప్పుడు చాలామంది ఉపవాసం ఉంటూ ఆ పూజలను నిర్వహిస్తారు.

అదేవిధంగా ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసేవారు వారి ఆహారంలో భాగంగా ఉల్లిపాయ వెల్లుల్లి మసాలా వంటి ఆహార పదార్థాలు తినకూడదని చెబుతుంటారు.ఇలాంటి ఆహార పదార్థాలు ఎందుకు తినకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి అవి తామసికం, రాజసికం, సాత్వికం అనే మూడు భాగాలుగా విభజించారు.ఈ ఆహార పదార్థాలను బట్టి మనిషిలో గుణాలు మారుతుంటాయి.

ఇక ఉల్లిపాయ వెల్లుల్లి మసాలా వంటి ఆహార పదార్థాలు రాజసికం గుణానికి సంబంధించినవి.ఇలాంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు మనలో కాస్త ఏకాగ్రత తగ్గిపోవటం, కోపం పెరగడం, మనసు నిలకడగా ఉండకపోవడం వంటి మార్పులు జరుగుతాయి.

Advertisement

అందుకే పూజ చేసే సమయంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదని చెబుతారు.

సాధారణంగా మనం ఏదైనా పూజ లేదా వ్రతం చేస్తున్న సమయంలో మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారిపై ఏకాగ్రత తో పూజ చేసుకోవాలని భావిస్తారు.ఈ క్రమంలోనే వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినడం వల్ల దేవుడిపై మన మనసు నిశ్చలంగా ఉండదు.అదేవిధంగా మన మనస్సులో ప్రశాంతత ఉండదు.

అందుకోసమే ఇలాంటి ఆహార పదార్థాలను పూజ చేసేవారు వ్రతం ఆచరించేవారు తినకూడదని పండితులు చెబుతున్నారు.ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల దేవునిపై ఏకాగ్రత ఉండదనే కారణంతో మాత్రమే వీటిని తినకూడదని చెప్పారు.

These Face Packs Help To Get Smooth Skin Details Face Packs
Advertisement

తాజా వార్తలు