తెలుగు లో చాల మంది దర్శకులు ఉన్నారు.ఎంతో మంది ఎన్నో సినిమాల్లో పని చేస్తూనే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తారు.
ఎవరికీ తెలియకుండానే పరిశ్రమ నుంచి వైదొలుగుతారు.కాదు కాదు పరిశ్రమ వారిని మరిచిపోతుంది.
అయితే సుకుమార్( Sukumar ) లాంటి దర్శకుడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ కి దొరికిన ఒక విభిన్నమైన నటుడు.అయన చేసిన, చేస్తున్న సినిమాల గురించి ఒక్కసారి చూస్తే అవి చాల కమర్షియల్ గా కనిపిస్తున్నప్పటికీ ఒక ఆర్ట్ ఫిలిం లాగ ఎంతో లాజిక్ ఉంటూక్రియేటివ్ గా కూడా కనిపిస్తాయి.
అంతే కాదు అయన చిత్రాలకు ఒక యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుంది.

ఇక ఈ మధ్య కాలంలో తెలుగు దర్శకులు చేస్తున్న సినిమాలు పక్క రాష్ట్రాల్లో జనాలకు కొన్ని సార్లు ఎక్కవు, ఆ మసాలా కొట్టుడు, హీరో భజన, ఓవర్ యాక్టింగ్ చూసి నవ్వుకునే వారు ఉంటారు.కానీ ఆర్య హీరోలు ఎవరు కూడా ఆలా ఉండరు.అయన తీసే సినిమాలు కూడా అందుకు పూర్తి భిన్నంగా ఉండటం విశేషం.
ఏ బాషా వారై కూడా చూసే వెసులుబాటు ఉంటుంది.మొదటి నుంచి కథ బాగా రాయగల సుకుమార్ జగడం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.
ఒకసారి రాజమౌళి తనకు బాగా నచ్చిన సినిమా జగడం అని చెప్పడం విశేషం.కేవలం హీరో కొత్తవాడు కావడం వల్లే ఆ సినిమా ఫెయిల్ అయ్యింది అని అయన తెలిపారు.

ఆర్య సినిమాల శైలి చూస్తే జగడం( Jagadam ) లో వయిలెన్స్ అనే ప్యాషన్ తో హీరో కనిపిస్తాడు.ఇక ఆర్య అండ్ ఆర్య 2 ప్రేమ త్యాగం చేస్తుంటారు హీరో.1 నేనొక్కడినే చిత్రంలో హీరో తనతో తానే పోరాడుతూ ఉంటాడు.ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో తండ్రి కోసం హీరో ఒక యుద్ధమే చేస్తాడు.
అది కూడా చాల లాజిక్ థింకింగ్ తో.ఇక రంగస్థలం( Rangasthalam ) చిత్రంలో అన్నను చంపిన వాడిని చంపడం కోసం రివెంజ్ తో కనిపిస్తాడు హీరో.పుష్ప లో కూడా తండ్రి వల్ల అవమానాలు పడుతూ స్మగ్లర్ గా ఎదుగుతాడు.ఇలా అయన తీసిన సినిమాలు ప్రపంచాల్లోనే అత్యుత్తమ దర్శకులు అయినా డేవిడ్ ఫించర్ ని పోలినట్టు గా ఉంటుంది.
తెలుగు తో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈయనే బెస్ట్ డైరెక్టర్.