మలబద్ధకం( Constipation ).అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.
మలబద్ధకం కారణంగా కడుపులో చాలా సౌకర్యంగా ఉంటుంది.ఏ పని పైన దృష్టి పెట్టలేకపోతుంటారు.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది.అందుకే మలబద్ధకం సమస్యను నివారించుకోవడం కోసం చాలా మంది మందులు వాడుతుంటారు.
కానీ సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి రెండే రెండు సార్లు ఈ స్మూతీని తీసుకుంటే మలబద్ధకం మళ్లీ మీ వంక చూడదు.మరి లేటెందుకు ఆ స్మూతీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled oats ) వేసి ఒక కప్పు వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక అరటిపండు( Sliced pineapple, one banana ), నానబెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు( Ginger slices ), రెండు ఫ్రెష్ పుదీనా ఆకులు, నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన ఓట్స్ పైనాపిల్ బనానా స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఈ స్మూతీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.వారానికి రెండు సార్లు చొప్పున ఈ స్మూతీని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.దాంతో మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.
మలబద్ధకంతో సతమతం అయ్యేవారు తప్పకుండా దీనిని ప్రయత్నించండి.పైగా ఈ స్మూతీ వెయిట్ లాస్ కు సహాయపడుతుంది.
ఎముకలను బలోపేతం చేస్తుంది.ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
మరియు క్యాన్సర్ వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.