పురుషులకు, స్త్రీలకు చలిలో తేడా... నిపుణులు చెప్పే కారణమిదే!

దేశవ్యాప్తంగా చలి వాతావరణం కొనసాగుతోంది.చలిని తట్టుకునేందుకు జనం వెచ్చని దుస్తులను ఉపయోగిస్తున్నారు.

ఇది చలి ప్రారంభ దశ మాత్రమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.రానున్న రోజుల్లో చలి మరింత పెరుగుతుందని అంటున్నారు.

ప్రకృతి ఎవరి విషయంలోనూ ఆపేక్ష చూపదు.చల్లని వాతావరణం ప్రతి ఒక్కరినీ ఇబ్బందికి గురిచేస్తుంది.

ఈ సమయంలో చాలామంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు.పురుషులు, స్త్రీలలో చలి అనుభూతిలో తేడా ఉంటుందని మీకు తెలుసా? నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు.దీని వెనుక శారీకర వ్యవస్థ, అంతర్గత మార్పులు కారణంగా నిలుస్తాయి.

Advertisement

చలికాలంలో అందరికీ జలుబు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు.పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరూ చలికి వణికిపోతుంటారు.

సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా చలిని అనుభూతి చెందుతారు.దీని వెనుక అత్యల్ప లేదా అధిక జీవక్రియ కారణంగా నిలుస్తుంది.

జీవక్రియ పని శరీరంలో శక్తి స్థాయిని నిర్వహించడం.ఎనర్జీ లెవెల్ బాగున్నప్పుడు చలి ఎక్కువగా అనిపించదు.

స్త్రీలలో ఈ జీవక్రియ రేటు పురుషుల కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.అందుకే మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా చలిగా అనిపిస్తుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

స్త్రీలకు అధికంగా చలిగా అనిపించడానికి మరొక కారణం ఏమిటంటే, పురుషుల కంటే స్త్రీలలో కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది.ఈ కండర ద్రవ్యరాశి ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

ఇది తక్కువగా ఉండటం వల్ల స్త్రీలకు వెంటనే వణుకు మొదలవుతుంది.వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత భిన్నంగా ఉండటం సహజం.25 డిగ్రీల ఉష్ణోగ్రతలో చాలామంది నివసించడానికి ఇష్టపడతారని నిపుణులు చెబుతుంటారు.

పురుషులు 22 డిగ్రీల సెల్సియస్‌ను ఇష్టపడతారని పరిశోధనల్లో తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో వృద్ధులు, పిల్లలు అందరూ ఉంటారు గనుక గది ఉష్ణోగ్రత 20 నుండి 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చలిగా అనిపించడం సహజం.

అయితే చలికాలంలో చలిగా అనిపించకపోతే, శరీరంలో ఏదో సమస్య ఉన్నదని అర్థం.అయితే ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా తరచూ చలిగా అనిపిస్తుంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు చేసిస్తున్నారు.

తాజా వార్తలు