విపక్ష పార్టీలన్నీ తమను టాబ్లెట్ చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న క్రమంలో, వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మరింత స్పీడ్ పెంచారు.ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తూనే ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇక వరుసగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక ఈరోజు జగన్ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం( Election Campaign ) చేపట్టే విధంగా షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.
ఈరోజు ఎన్నిక ప్రచార షెడ్యూల్ ను వైసిపి ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం ప్రకటించారు.ఈరోజు ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలో( Rajanagaram Constituency ) ఉన్న కోరుకొండ జంక్షన్ లో జరిగే ప్రచార కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్ స్థానం పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో జరిగే సభకు జగన్ హాజరవుతారు.
ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం లోక్ సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం లో( Gajuwaka Constituency ) ఉన్న పాత గాజువాక సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.అయితే నిన్ననే ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోది( PM Narendra Modi ) జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం, ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయింది అంటూ ఘాటుగా విమర్శలు చేయడం, తదితర పరిణామాల నేపథ్యంలో ప్రధాని విమర్శలకు జగన్ ఈ సభలో కౌంటర్ ఇస్తారా .? లేక టిడిపి , జనసేన లను మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం వైసీపీ కి మరింతగా జనాల్లో ఆదరణ పెరిగిందని, కూటమి పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ను జనాలు నమ్మే పరిస్థితిలో లేరని, 2019 ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో, మళ్లీ తమకే పట్టం కడతారనే నమ్మకంతో జగన్ ఉన్నారు.అందుకే జగన్ ప్రతి సభలోను ఈ పథకాల గురించే ఎక్కువ హైలైట్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.