టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప 2 మూవీతో( Pushpa 2 ) దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్.
ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై ఇప్పుడు బోలెడు అంచనాలు ఉన్నాయి.
నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ ఎవరితో చేస్తారు? ఆ సినిమా ఎలా ఉండబోతోంది అన్న అంశాలు ప్రస్తుతం ఆసక్తి రేపుతున్నాయి.

కాగా బన్నీ నటించే తదుపరి చిత్రం కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి.అయితే హీరో అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు.అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ( Director Atlee ) దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారని తెలుస్తోంది.సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట.రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు అట్లీ.ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు.
ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రాన్ని చేశారు.

ఇందులో నయనతార, దీపిక పడుకొనే ( Nayanthara , Deepika Padukone )హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.అయితే, అల్లు అర్జున్‌తో నటించే హీరోయిన్ ను కూడా అట్లీ ఫైనల్ చేశారట.ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట.ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్‌కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ ను ఎంపిక చేశారట.భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారట.ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం.ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉంది అని తెలుస్తోంది.
ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం కావచ్చట.