శ్రీలీల( Srilila ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట రాఘవేంద్రరావు( Raghavendra Rao ) దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఒకవైపు చదువులను కొనసాగిస్తూనే మరొకవైపు హీరోయిన్ గా రాణిస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈ మధ్యకాలంలో శ్రీలీల నటించిన సినిమాలు కొత్తగా సక్సెస్ అవడం లేదు.ఆ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.

భగవంత్ కేసరి మినహా ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ ముద్దుగుమ్మ.శ్రీలీల సినిమాలో ఉన్నారంటే మూడు పాటలు.అందులో డాన్స్ అన్నట్లు మారిపోయింది పరిస్థితి.కేవలం డాన్స్ కోసమే ఆమెను తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Skanda, Adikesava, Extraordinary Man )తాజాగా రాబిన్ హుడ్ వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల కెరీర్ కు ఉపయోగపడలేదని చెప్పాలి.పైగా ఎందుకు ఇలాంటి రోల్స్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది.
చేసిన 8 సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్టు గుంటూరు కారం పర్లేదని అనిపించింది.

మిగిలినవన్నీ ఫ్లాపే అని చెప్పాలి.గ్యాప్ తీసుకున్నా పర్లేదు గానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్.ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్, మాస్ జాతర, NC24, అఖిల్ 6 సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల.
శివకార్తికేయన్( Sivakarthikeyan ) హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న సినిమా పరాశక్తి.ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది శ్రీలీల.ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాలు హిట్టైతే శ్రీలీల పక్క ఇండస్ట్రీల్లోనూ పాగా వేయడం ఖాయం.కానీ ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకుంటేనే కెరీర్ గాడిన పడుతుంది.
లేదంటే ఈమె కెరిర్ డేంజర్ లో పడటం ఖాయం అని చెప్పాలి.