సినిమాలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.చక్కటి కథలకు తోడు.
అద్భుతమైన టెక్నాలజీ యాడ్ కావడంతో ఓరేంజిలో తెరకెక్కుతున్నాయి.అందుకే సినిమా నిర్మాణం విషయంలో నిర్మాతలు ఎంత డబ్బు కావాలంటే అంత పెడుతున్నారు.
రకరకాల పద్దతుల్లో కనీసం పెట్టిన డబ్బు అయినా వస్తుంది తప్ప.నష్టం రాదనే ధీమాలో ఉంటుందన్నారు ప్రొడ్యూసర్లు.
అంతేకాదు.సినిమాలు సైతం ఓ రేంజిలో హిట్ అవుతున్నాయి.
తక్కువ సంఖ్యలో సినిమాలు మాత్రమే ఫ్లాప్ అవుతున్నాయి.
అయితే సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు తరుచుగా బాక్సాఫీస్ అనే మాట వినిపిస్తోంది.ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయనో.లేదంటే ఘోర పరాజయాన్ని పొందాయనో వింటుంటాం.దీనితో పాటు పలు పత్రికలు, న్యూస్ చానెల్స్ లో పలానా సినిమా గ్రాస్ కలెక్షన్ ఇంత సాధించింది.నెట్ కలెక్షన్ ఇంత వసూళు చేసిందని చూస్తుంటాం.
అయితే ఇంతకీ గ్రాస్ కలెక్షన్ అంటే ఏంటి? నెట్ కలెక్షన్ అంటే ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సినిమా టికెట్ మీద పెట్టిన మొత్తం డబ్బులన్నీ కౌంట్ చేసే విధానాన్ని గ్రాస్ కలెక్షన్ అంటారు.ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మైనస్ చేశాక వచ్చిన డబ్బులను నెట్ కలెక్షన్ అంటారు.అయితే ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు.
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది.మొత్తంగా టికెట్ అమ్మితే వచ్చిన టోటల్ అమౌంట్ గ్రాస్ కలెక్షన్ కాగా.
గ్రాస్ కలెక్షన్ నుండి టాక్స్ లను తీయగా వచ్చేది నెట్ కలెక్షన్.పలు సినిమా విషయంలో గ్రాస్ కలెక్షన్ నే బయటకు చూపిస్తారు నిర్మాతలు.
తమ తదుపరి సినిమాల్లో లాభం పొందేందుకు తాము చేసిన పలనా సినిమా భారీగా గ్రాస్ కలెక్షన్ సాధించింది అని చెప్తారు.అందేకాదు.
ప్రసార సాధనాలు కూడా సినిమాల వసూళ్లకు ఎక్కువగా గ్రాస్ కలెక్షన్ మీదే ఫోకస్ చేస్తాయి.