వైట్ హెయిర్ ను ఒక్క వాష్ లో బ్లాక్ గా మార్చే న్యాచురల్ రెమెడీ మీ కోసం!

వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టుతో బాధపడే వారు ఎంతో మంది ఉన్నారు.తెల్ల జుట్టు ( White hair )అందాన్ని తగ్గిస్తుంది.

 Natural Remedy To Turn White Hair Into Black , Natural Remedy, White Hair,-TeluguStop.com

ముసలి వారిలా కనిపించేలా చేస్తుంది.అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్ వేసుకుంటూ ఉంటారు.

కానీ సహజంగా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ న్యాచురల్ రెమెడీతో కేవలం ఒక్క వాష్ లోనే వైట్ హెయిర్ ను బ్లాక్ గా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ప‌ది బాదం పప్పులు ( Almonds )వేసి పూర్తిగా నల్లగా మారేంత వరకు వేయించి తీసుకోవాలి.ఆ తర్వాత అదే కడాయిలో ఒక కప్పు కరివేపాకు( Curry leaves ) ఒక కప్పు గోరింటాకు, అర కప్పు మునగాకు వేసి పూర్తిగా నల్లగా అయ్యేంత వరకు వేయించాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న ఆకులు మరియు బాదంపప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న పౌడ‌ర్ తో మూడు టేబుల్ స్పూన్ల ఆవనూనె, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.కేవ‌లం ఒక్క వాష్ లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

మీ వైట్ హెయిర్ బ్లాక్ గా మారుతుంది.పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

పది రోజులకు ఒకసారి ఈ రెమెడీని ఫాలో అయితే వైట్ హెయిర్ కు దూరంగా ఉండవచ్చు.కలర్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube