ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.మరి వాళ్ళు చేసిన సినిమాలు వాళ్లకు మంచి గుర్తింపును తీసుకొస్తున్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకోవడంలో మాత్రం వాళ్ళు కొంతవరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు భారీ విజయాలను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం భారీ విజయాన్ని సాధించడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు.
పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) 1850 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో భారీ వసూళ్లను రాబట్టాలని చూస్తున్నాడు.

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఒక్క సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ని కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అట్లీతో చేస్తున్న సినిమా కోసం 350 కోట్ల రెమ్యూనరేషన్ ( 350 crore remuneration )ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.
మరి ప్రొడ్యూసర్ సైతం భారీ రేంజ్ లో అతనికి రెమ్యునరేషన్ ఇచ్చి మరీ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అందరికంటే అల్లు అర్జున్ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది.ఇక ఆయన భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరుగుతుంది.తద్వారా సినిమా సూపర్ సక్సెస్ అయితే అంతకుమించిన వసూళ్లయితే వస్తాయి.
లేకపోతే మాత్రం కొంతవరకు ప్రొడ్యూసర్స్ నష్టాలను చవి చూసే ప్రమాదం కూడా ఉంది…మరి అల్లు అర్జున్ రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…