ఇటీవల డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) పరిపాలన యంత్రాంగం పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (సీఐఎస్) అంబుడ్స్‌మన్ కార్యాలయం సహా మూడు పర్యవేక్షణ సంస్థలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది.ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్న దాని ప్రకారం ఇది హెచ్ 1 బీ వీసాపై( H1B visa ) ఉన్న ప్రవాస భారతీయులకు , ఎఫ్ 1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్ధులకు పెద్ద దెబ్బ.
వీరికి అంబుడ్స్‌మన్ విలువైన సేవలను అందించారు.
ఈ పర్యవేక్షణ సంస్థలను తొలగించడం వలన ప్రస్తుతం ట్రంప్ పరిపాలనా యంత్రాంగం .నియంత్రణ లేకుండా అధికారాన్ని వినియోగించుకుంటుందని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ( American Immigration Lawyers Association )(ఏఐఎల్ఏ) హెచ్చరించింది.ఏఐఎల్ఏ ప్రభుత్వ సంబంధాల సీనియర్ డైరెక్టర్ శార్వరి దలాల్ ధేనీ మీడియాతో మాట్లాడుతూ.వ్యక్తులు, వ్యాపారాలు వివిధ సమస్యలపై సీఐఎస్ అంబుడ్స్‌మన్ నుంచి సహాయం కోరాయి.2024లో అంబుడ్స్‌మన్ కార్యాలయం సుమారు 30 వేల దరఖాస్తుదారులకు సహాయం చేసింది.

ఎఫ్ 1, హెచ్ 1 బీ వీసాదారులకు యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)లో వారి చట్టపరమైన స్థితి, జీవినోపాధికి ముప్పు కలిగించే బ్యూరోక్రాటిక్ అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు సీఐఎస్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారని ఆర్టింగ్టన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ న్యాయవాది రాజీవ్ ఎస్ ఖన్నా తెలిపారు.అసాధారణ జాప్యాలు, హెచ్ 1 బీ వీసా గడువు పొడిగింపు అంశాల్లో అన్ని నియమాలను పాటించినప్పటికీ ప్రజలు నెలల తరబడి ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఖన్నా తెలిపారు.ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) దరఖాస్తులు తప్పుగా నిర్వహించబడినప్పుడు విద్యార్ధులు తరచుగా అంబుడ్స్‌మన్ సాయం కోరేవారని ఖన్నా తెలిపారు.

ఒక అంతర్జాతీయ విద్యార్ధి STEM OPT రుసుము( STEM OPT Fee ) చెల్లించిన సందర్భాన్ని శార్వరీ దలాల్ – ధేని పంచుకున్నారు.కానీ బ్యాంక్ ప్రాసెసింగ్ లోపం కారణంగా చెల్లింపు జరిగిన రెండు నెలల తర్వాత దరఖాస్తు తిరస్కరించబడిందని ఆమె చెప్పారు.అప్లికేషన్ విండో మూసివేయబడినందున విద్యార్ధి తిరిగి దరఖాస్తు చేసుకోలేకపోయాడని.
అయితే సీఐఎస్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించడంతో యూఎస్‌సీఐఎస్‌తో చర్చలు జరిపి విద్యార్ధికి తిరిగి ఆమోదం లభించిందని శార్వరీ అన్నారు.ఆలస్యం, తిరస్కరణలు, ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ లేకపోవడం వంటి వాటి విషయంలోనూ అంబుడ్స్‌మన్ కార్యాలయం సహాయపడిందని శార్వరీ గుర్తుచేసుకున్నారు.