సాధారణంగా చాలా మందికి ముఖం శరీరం మొత్తం తెల్లగా మృదువుగా ఉన్నా.మోచేతులు, మోకాళ్ళు( Black Elbows Knees ) మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
ఈ సమస్యను పురుషులు పెద్దగా పట్టించుకోరు.కానీ స్త్రీలు మాత్రం ఆయా భాగాల్లో నలుపును వదిలించుకునేందుకు తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.
ఖరీదైన క్రీమ్ లు వాడుతుంటారు.కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా నల్లగా అసహ్యంగా కనిపిస్తున్న మోచేతులు మోకాళ్ళను ఒక్క వాష్ లో తెల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ( Home Remedies ) సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు బియ్యం కడిగిన వాటర్( Rice Water ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతులు మోకాళ్ళకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత నిమ్మ చెక్కను తీసుకుని మోచేతులు మోకాళ్ళను కనీసం ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.చివరిగా మంచి మాయిశ్చరైజర్ ను మోచేతులు మరియు మోకాళ్ళకు అప్లై చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఆల్మోస్ట్ ఒక్క వాష్ లోనే నలుపు మొత్తం మాయం అవుతుంది.ఇంకా నలుపు కనుక ఉంటే రెండు మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి.నల్లగా అసహ్యంగా కనిపిస్తున్న మీ మోచేతులు మోకాళ్లు కొద్ది రోజుల్లో తెల్లగా మృదువుగా మెరుస్తాయి.అందంగా కనిపిస్తాయి.అలాగే ఈ హోమ్ రెమెడీని మెడ, అండర్ ఆర్మ్స్( Under Arms ), పాదాల నలుపు వదిలించడానికి కూడా ఉపయోగించవచ్చు.