వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఆయా దేశాల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.త్వరలో కెనడాలో( Canada ) ముందస్తు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో మరోసారి భారతీయులు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 65 మంది భారత సంతతి అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.
ఈ గణాంకాలు కెనడాలో పెరుగుతున్న భారతీయుల ప్రాబల్యం గురించి తెలియజేస్తున్నాయి.
కెనడాలోని ప్రముఖ రాజకీయ పార్టీలైన లిబరల్స్, కన్జర్వేటివ్స్, ఎన్డీపీ, గ్రీన్స్( Liberals, Conservatives, NDP, Greens ) తదితర పార్టీలు భారతీయులకు టికెట్స్ ఇచ్చాయి.కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగానూ పోటీ చేస్తున్నారు.
వీరంతా అంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, మానిటోబా వంటి కీలక ప్రావిన్సులలో విస్తరించి ఉన్నారు.

కెనడాలోని దక్షిణాసియా జనాభా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.2021లో 45 మంది పంజాబీ అభ్యర్ధులు పోటీ చేయగా.17 మంది హౌస్ ఆఫ్ కామన్స్‌లో అడుగుపెట్టారురు.2019లో 47 మంది పోటీ చేయగా.22 మంది ఎన్నికయ్యారు.ఈసారి 16 మంది సిట్టింగ్ పంజాబీ మూలాలున్న ఎంపీలు తిరిగి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు.కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పక్షాల అభ్యర్ధులు భారతీయులే కావడం గమనార్హం.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ వ్యక్తుల్లో లిబరల్ పార్టీకి చెందిన ఆరోగ్య మంత్రి కమల్ ఖేరా బ్రాంప్టన్ ( Minister Kamal Khera Brampton )నుంచి.ఓక్‌విల్లే నుంచి ఇన్నోవేషన్ , సైన్స్ అండ్ పరిశ్రమల మంత్రి అనితా ఆనంద్.మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ బర్దిష్ చాగర్ వాటర్లూ నుంచి పోటీ చేస్తున్నారు.ఇక కెనడా రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఉన్న భారత సంతతి నేత, ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ బర్నాబీ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు.
వలసలు, ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు, ఆర్ధిక అవకాశాలు, కెనడా విదేశాంగ విధానం, ముఖ్యంగా భారత్ – దక్షిణాసియాతో దాని సంబంధాలు వంటి అంశాలపై ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునే అంశాలపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి.