సమంత కెరీర్ కు మైలురాళ్లుగా నిలిచిన సినిమాలేంటో తెలుసా?

టాలీవుడ్ ఒక్కటే కాదు.దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంతా.

 Samantha Career Best Movies In Her Career , Samantha, Heroine, Yem Mayachesava,-TeluguStop.com

అందం, అభినయంతో అదరగొడుతూ.అగ్రతారగా దూసుకెళ్తుంది.

ఓ వైపు గ్లామర పాత్రలు చేస్తూ కుర్రకారులో సెగలు రేపుతూనే.మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో పోషిస్తూ మెప్పిస్తోంది.

ప్రస్తుతం సమంత లేడీ ఓరియెండెట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.వెబ్ సిరీస్ లలోనూ అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.

క్రేజీ యాక్టర్ గా పేరు సంపాదించింది.అంతేకాకుండా.

ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రీతిలో పారితోషకం అందుకుంటుంది.ఇప్పటి వరకు హీరోయిన్ గా కొనసాగిన సమంతా త్వరలో కొత్త అవతారం ఎత్తబోతుంది.

నిర్మాతగా మారి టాలెంటెడ్ పర్సన్స్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ విషయంపై సమంతా స్పందించాల్సి ఉంది.

సమంతా నటించిన సినిమాల్లో పలు చిత్రలు తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడ్డాయి.అందులో మొదటిది ఏమాయ చేసావే.గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంతా జెస్సీ పాత్ర పోషించింది.ఆమె నటన, అందం, ఎక్స్ ప్రెషన్స్.

అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.సమంత కెరీర్ లో అవార్డు అందుకున్న తొలి సినిమాగా ఏమాయ చేసావే నిలిచింది.

ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది.అటు బృందావ‌నం సినిమాలో కాజల్ తో కలిసి నటించి కమర్షియల్ సినిమాల్లో కూడా సత్తా చాటలగలదని నిరూపించుకుంది.

ఈ సినిమా తర్వాత సమంతా రంగ‌స్థ‌లంలో నటించింది.రామ‌ల‌క్ష్మి అనే డీ గ్లామర్ పాత్రలో అదరగొట్టింది.

రంగ‌స్థ‌లం తన సినిమా కెరీర్ లోనే ఆల్ టై హిట్ గా నిలిచింది.

Telugu Brudavanam, Majili, Samantha, Samanthacareer, Tollywood, Yem Mayachesava-

వివాహం తర్వాత తన భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ అనే సినిమాలో నటించింది.ఈ సినిమాలో సమంతా రోల్ అత్యంత్య కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాలోనూ డీ గ్లామర్ పాత్ర చేసిన సమంతా.

అద్భుతంగా ఎమోషన్స్ పండించింది.ఆ తర్వాత ఓబేబీ సినిమాతో తన నటనా గొప్పతనం నిరూపించుకుంది.

బామ్మ పాత్రలా నటిస్తూ అదుర్స్ అనిపించింది.ఈ సినిమాతో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube