ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఏదనే ప్రశ్నకు కోర్ట్ సినిమా( Court movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఈ నెల 11 నుంచి ఓటీటీలో కోర్ట్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
హర్ష్ రోషన్, శ్రీదేవి ( Harsh Roshan, Sridevi )జంటగా ఈ సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా శివాజీ మంగపతి పాత్రలో అదరగొట్టారు.
నాని 12 కోట్ల రూపాయల బడ్జెట్( Nani’s budget is 12 crore rupees ) తో ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా డిజిటల్ హక్కులు 8 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

కోర్ట్ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ అయితే బాగుంటుందని కామెంట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి.కోర్ట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రియదర్శి త్వరలో సారంగపాణి జాతకం సినిమాతో( Sarangapani Jathakam ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
కోర్ట్ సినిమా కథ, కథనం రివ్యూవర్లను సైతం మెప్పించిన సంగతి తెలిసిందే.

కోర్ట్ సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కోర్ట్ డ్రామాలు తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.నాని భవిష్యత్తులో అభిరుచి ఉన్న మరిన్ని సినిమాలను నిర్మిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్యత ఉన్న సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కోర్ట్ సినిమా చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.