ఈ పొడిని తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా మాయం అవ్వాల్సిందే!

గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి రకరకాల కారణాల వల్ల నాజూగ్గా ఉండాల్సిన పొట్ట సాగిపోతుంటుంది.పట్ట భారీగా సాగిపోవడం వల్ల శరీర ఆకృతి అందవిహీనంగా మారుతుంది.

 This Powder Helps To Get Rid Of Belly Fat Very Quickly , Powder, Belly Fat, Bell-TeluguStop.com

ఏ బట్టలు వేసుకున్నా అస్సలు సూట్ అవ్వవు.పైగా ఇరుగు పొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్లు మరింత కలవర పెడతాయి.

మీరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అయితే ఇకపై అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా మాయం అవ్వాల్సిందే.

మరి ఇంకెందుకు ఆలస్యం బాన పొట్టను తగ్గించే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలి మరియు ఏ విధంగా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Belly Fat, Tips, Latest, Powder-Telugu Health Tips

ముందుగా రెండు కప్పుల కరివేపాకు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఎండ పెట్టుకున్న కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకుని తీసుకోవాలి.కరివేపాకును వేయించుకున్న పాన్ లోనే వ‌న్‌ టేబుల్ స్పూన్ జీలకర్ర, వ‌న్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి.

మళ్లీ అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి మంచిగా వేయించుకోవాలి.

Telugu Belly Fat, Tips, Latest, Powder-Telugu Health Tips

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న కరివేపాకు, అవిసె గింజలు, మిరియాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఐదారు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే బాన పొట్టను తగ్గించే పొడి సిద్ధమయినట్టే.ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఈ పొడితో పాటు కొద్దిగా నెయ్యి వేసి కలిపి తీసుకోవాలి.లేదా ఒక క్లాస్ పల్చటి మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ తయారుచేసుకున్న పొడిని మిక్స్ చేసి సేవించాలి.

ఇలా ఎలా తీసుకున్నా వేలాడే పొట్ట క్రమంగా మాయం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube