మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా నిద్రపోవాలా?

మంచి తిండి, మంచి వాతావరణంతో పాటు, మంచి నిద్ర కూడా మనిషికి ఎంతో అవసరం.నిద్రలేమి సమస్య ఉందంటే, లేని ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టే.

ఈ నిద్ర మగవారికి, ఆడవారికి ఇద్దరికీ అవసరం.కాని మగవారి కన్నా ఆడవారికి నిద్ర అవసరం కొంచెం ఎక్కువే అని డాక్టర్లు చెబుతున్నారు.

మరి మగువలు మగవారి కన్నా ఎక్కువసేపు ఎందుకు నిద్రపోవాలో చూద్దాం.పరిశోధకులు ఎన్నో అధ్యయనాల తరువాత తేల్చిన విషయం ఏమిటంటే, మగవారి మెదడు కన్నా, ఆడవారి మెదడుకి విశ్రాంతి కొద్దిగా ఎక్కువ దొరకాలంట.

ఆడవారి శరీరం ఓ వయసుకి వచ్చాక నిరంతరం హార్మోనుల కదలికలతో ప్రభావితం అవుతూ ఉంటుంది.పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే మార్పులు నిద్రను ప్రభావితం చేస్తాయి.

Advertisement

అలాగే ప్రెగ్నెన్సి, మెనోపాజ్ కూడా నిద్రను బాగా ప్రభావితం వేస్తాయి.ఈ కారణాల వలన ఇటు శరీరానికి, అటు మనసుకి మంచి విశ్రాంతి దొరకాలి.

రోజువారి జీవితంలో ఆడవారి జీవితాలపై ఉండే ఒత్తిడే వేరు.ఇంటి పని, వంట పని, పిల్లలు, భర్త .జాబ్ చేస్తే అది కూడా అదనపు టెన్షన్.ఇలా తీవ్ర ఒత్తిడికి లోనవుతారు.

అదీకాకుండా మగవారి కన్నా ఆడవారి మెదడు చాలా కాంప్లెక్సివ్ గా పని చేస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.కాబట్టి మగవారి కన్నా కనీసం 20 నిమిషాలు ఎక్కువగా నిద్రపోవాలంట ఆడవారు.

ఆడవారి శరీరానికి అది చాలా అవసరం.అలాగని మగవారు కష్టపడట్లేదు, వారి మీద ఒత్తిడి లేదు అని కాదు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా

శరీరం నిర్మాణం, శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు ఇటు ఆడవారిలో, అటు మగవారిలో తేడాలు తేస్తాయి.

Advertisement

తాజా వార్తలు