సినిమాలు హిట్ కావాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.ఆడియో రిలీజ్ అనీ, ప్రీరిలిజ్ అని రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
సినిమా విడుదలకు ముందు టీవీ స్టూడియోలకు వెళ్లి.ఈ సినిమా నభూతో నభవిష్యత్ అని చెప్తారు.
ఒకవేళ సినిమా విజయం సాధిస్తే.సక్సెస్ మీట్లంటూ నానా హడావిడి చేస్తారు.
హీరోలు, దర్శకులు, హీరోయిన్లతో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇప్పిస్తారు.
ఒకవేళ సినిమా పరాజయం పాలైతే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు.
మాట్లాడినా మూవీ టీం బాధపడుతుందని సైలెంట్ అవుతారు.అందుకే ఫ్లాప్ అయిన సినిమా గురించి ఎక్కడా చర్చలు ఉండవు.
కానీ కొందరు హీరోలు ఇందుకు మినహాయింపు.తమ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని స్వయంగా తామే ఒప్పుకున్నారు.ఇంతకీ ఆహీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కల్యాణ్

తన కరెర్లో పవన్ కల్యాణ్ ఎన్నో సినిమాలు చేశాడు.వాటిలో చాలా మూవీస్ హిట్ అయ్యాయి.మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.అయితే సర్దార్ గబ్బర్ సింగ్, జానీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయని పవన్ స్వయంగా చెప్పడం విశేషం.
మహేష్ బాబు

టాలీవుడ్ టాప్ హీరో మహేష్ కూడా తను నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పాడు.శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ లో సైనికుడు, ఆగడు సినిమాలు నిరాశ పరిచినట్లు వెల్లడించాడు.
నాని

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ప్లాప్ అయ్యింది.డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఇదో మంచి సినిమా అంటూ ప్రమోట్ చేస్తే.సినిమా సరిగా ఆడలేదని నాని ట్వీట్ చేయడం విశేషం.
నాగార్జున

రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆఫీసర్.ఈ సినిమా డిజార్ట్ గా మిగిలిందని స్వయంగా నాగార్జునే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
జూ.ఎన్టీఆర్

టెంపర్ ఆడియో రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన గత సినిమాలు అంతగా ఆడలేదని చెప్పాడు.ముందు ముందు వచ్చే సినిమాలు బాగుంటాయన్నాడు.కానీ ఏ సినిమాలు బాలేవు అని మాత్రం చెప్పలేదు.