ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి.. తెర వెనుక రంగం సిద్ధం

భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి ( Billionaire Vivek Ramaswamy )ఒహియో గవర్నర్ రేసులో ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రామస్వామి అధికారికంగా తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.39 ఏళ్ల వివేక్ రామస్వామి సిన్నినాటీలో తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.2026 రిపబ్లికన్ ప్రైమరీలో ( Republican primary )ఆయన అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఫ్రంట్ రన్నర్‌గా భావిస్తున్న అప్పటి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జాన్ హస్టెడ్ యూఎస్ సెనేట్ కోసం పోటీ నుంచి నిష్క్రమించిన ఒక నెల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 Indian Origin Vivek Ramaswamy Set To Join Ohio Governor's Race , Vivek Ramaswamy-TeluguStop.com

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన వివేక్ రామస్వామి. రిపబ్లికన్ పార్టీ ( Republican Party ) నామినేషన్ కోసం ప్రయత్నించారు.ఆ తర్వాత అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుని డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతు ప్రకటించారు.

అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత డోజ్‌కు ఎలాన్ మస్క్‌తో పాటు సారథిగా నియమించారు.అయితే కొద్దిరోజులకే డోజ్ బాధ్యతల నుంచి వివేక్ తప్పుకున్నారు.ఒహియో గవర్నర్( Governor of Ohio ) రేసులో నిలబడటానికి గాను కీలక ఆమోదాలు పొందడంతో పాటు దాతలు ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.అయితే వివేక్ పోటీకి అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఆమోదముద్ర వేయలేదు.

Telugu Dr Amy Acton, Governor Ohio, Indianorigin, Jopprimary, Republican, Vivek

ఒహియోకు గవర్నర్‌గా రిపబ్లికన్ నేత మైక్ డివైన్ ఇన్నాళ్లు సేవలు అందించారు.ఆయన స్థానంలో ఒహియో గవర్నర్‌గా రామస్వామి జీవోపీ ప్రైమరీ బరిలో( JOP primary constituency ) నిలిచారు.ఒహియో గవర్నర్ పదవి కోసం ఇప్పటికే ఒహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ జనవరిలో బిడ్ ప్రకటించారు.అప్పలాచియోకు చెందిన నల్లజాతి వ్యవస్థాపకురాలు హీథర్ లాల్ , కోవిడ్ 19 అమెరికాపై విరుచుపడిన సమయంలో ఒహియోను అద్భుతంగా నడిపించిన మాజీ స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అమీ ఆక్టన్ ( Former State Health Director Dr.Amy Acton )డెమొక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.

Telugu Dr Amy Acton, Governor Ohio, Indianorigin, Jopprimary, Republican, Vivek

ఒహియోలో రిపబ్లికన్లదే హవా.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడు సార్లు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ రాష్ట్రం నుంచి దాదాపు 8 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యనిర్వాహక కార్యాలయాన్ని రిపబ్లికన్లు కలిగి ఉన్నారు.

ఒహియో సుప్రీంకోర్టులోనూ, రెండు శాసనసభలలోనూ సూపర్ మెజారిటీలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube