ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే రక్తహీనత అన్న మాటే అనరు!

రక్తహీనత వేధిస్తుందా.? దాని కారణంగా నీరసం, అలసట, జుట్టు అధికంగా రాలడం, బరువు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మం పాలిపోవడం వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా.? రక్తహీనత( anemia ) నుంచి బయట పడటం కోసం మందులు వాడుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే లడ్డూను డైట్ లో చేర్చుకోవాల్సిందే.ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే రక్తహీనత అన్న మాటే అనరు.

 Anemia Will Go Away If You Take This Laddu , Nuts Laddu, Latest News, Health, He-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కప్పు బాదం,( almonds ) ఒక కప్పు వాల్ నట్స్( Wall nuts ), ఒక కప్పు జీడిపప్పు( cashew nut ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పులు గింజ తొలగించిన ఖర్జూరం( Dates ) వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

నెయ్యి హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న బాదం, వాల్ నట్స్, జీడిపప్పు పలుకులు వేసుకోవాలి.ఇది కాస్త దోర‌గా వేగిన తర్వాత ప‌దిహేను ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్‌, అరకప్పు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి.చివరిగా ఖర్జూరం పేస్ట్ కూడా వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ నట్స్ లడ్డూను రోజుకొకటి చొప్పున ప్రతి రోజు తీసుకుంటే శరీరానికి అవసరం అయ్యే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.దాంతో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య దూరం అవుతుంది.రెగ్యులర్ గా ఈ లడ్డూను తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఈ లడ్డూను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.బాడీ ఎనర్జిటిక్ గా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube