ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి.. తెర వెనుక రంగం సిద్ధం

ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి తెర వెనుక రంగం సిద్ధం

భారత సంతతికి చెందిన బిలియనీర్ వివేక్ రామస్వామి ( Billionaire Vivek Ramaswamy )ఒహియో గవర్నర్ రేసులో ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి తెర వెనుక రంగం సిద్ధం

ఈ నేపథ్యంలో రామస్వామి అధికారికంగా తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.39 ఏళ్ల వివేక్ రామస్వామి సిన్నినాటీలో తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి తెర వెనుక రంగం సిద్ధం

2026 రిపబ్లికన్ ప్రైమరీలో ( Republican Primary )ఆయన అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఫ్రంట్ రన్నర్‌గా భావిస్తున్న అప్పటి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జాన్ హస్టెడ్ యూఎస్ సెనేట్ కోసం పోటీ నుంచి నిష్క్రమించిన ఒక నెల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన వివేక్ రామస్వామి.రిపబ్లికన్ పార్టీ ( Republican Party ) నామినేషన్ కోసం ప్రయత్నించారు.

ఆ తర్వాత అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుని డొనాల్డ్ ట్రంప్‌కు మద్ధతు ప్రకటించారు.

అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత డోజ్‌కు ఎలాన్ మస్క్‌తో పాటు సారథిగా నియమించారు.

అయితే కొద్దిరోజులకే డోజ్ బాధ్యతల నుంచి వివేక్ తప్పుకున్నారు.ఒహియో గవర్నర్( Governor Of Ohio ) రేసులో నిలబడటానికి గాను కీలక ఆమోదాలు పొందడంతో పాటు దాతలు ఏర్పాటు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

అయితే వివేక్ పోటీకి అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఆమోదముద్ర వేయలేదు. """/" / ఒహియోకు గవర్నర్‌గా రిపబ్లికన్ నేత మైక్ డివైన్ ఇన్నాళ్లు సేవలు అందించారు.

ఆయన స్థానంలో ఒహియో గవర్నర్‌గా రామస్వామి జీవోపీ ప్రైమరీ బరిలో( JOP Primary Constituency ) నిలిచారు.

ఒహియో గవర్నర్ పదవి కోసం ఇప్పటికే ఒహియో అటార్నీ జనరల్ డేవ్ యోస్ట్ జనవరిలో బిడ్ ప్రకటించారు.

అప్పలాచియోకు చెందిన నల్లజాతి వ్యవస్థాపకురాలు హీథర్ లాల్ , కోవిడ్ 19 అమెరికాపై విరుచుపడిన సమయంలో ఒహియోను అద్భుతంగా నడిపించిన మాజీ స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ అమీ ఆక్టన్ ( Former State Health Director Dr.

Amy Acton )డెమొక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. """/" / ఒహియోలో రిపబ్లికన్లదే హవా.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మూడు సార్లు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ రాష్ట్రం నుంచి దాదాపు 8 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యనిర్వాహక కార్యాలయాన్ని రిపబ్లికన్లు కలిగి ఉన్నారు.ఒహియో సుప్రీంకోర్టులోనూ, రెండు శాసనసభలలోనూ సూపర్ మెజారిటీలు ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025