సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నప్పటికీ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయటకు రావడం లేదు.ఇలా ఈ సినిమా షూటింగ్స్ చాలా రహస్యంగా జరుపుతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు క్రేజ్ గురించి మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu )ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.దక్షిణాదిలోనే మహేష్ బాబుకి సమానమైన హీరోలు ఎవరూ లేరు అంటూ ఈయన మాట్లాడారు.మహేష్ బాబుకి విపరీతమైనటువంటి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అలాంటి ఫాలోయింగ్ మరే హీరోకి కూడా సాధ్యం కాలేదని తెలిపారు.అమ్మాయిలకు సూపర్ స్టార్ కలల రాకుమారుడని అభివర్ణించారు.
హ్యాండ్సమ్ విషయంలో తనకు తిరుగులేదని, అతన్ని ఇష్టపడని మహిళలంటూ ఎవరూ ఉండరన్నారు.కుటుంబ సమేతంగా తన సినిమాలను అందరు చూస్తారని, తన సతీమణి మహేష్ బాబును తమ్ముడిలా భావిస్తుందని తెలిపారు.

నటుడిగా మహేష్ బాబుకి 100 ప్లస్ పాయింట్ లు ఉన్నాయని అనేక అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని నాగబాబు మహేష్ బాబు పై ప్రశంసల వర్షం కురిపించారు.చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉండే మహేష్ బాబు పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేస్తూ చాలా స్లిమ్ గా మారిపోయారని గుర్తు చేసుకున్నారు.ఇలా ఉన్నఫలంగా మహేష్ బాబు గురించి నాగబాబు ప్రశంసల వర్షం కురిపించడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఈ సినిమా తర్వాత తమ హీరోకి హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.