అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఈనెల 5న భూమిపూజ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇంకా భూమి పూజ కోసం రామ భక్తులు ఎక్కడెక్కడ నుండో అయోధ్య బాట పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు రామ భక్తులు పుణ్యస్థలాల నుండి మట్టిని తీసుకువస్తే.మరికొందరు పుణ్య నదుల నుండి నీరు తీసుకొస్తున్నారు.
అయితే రామభక్తులైన ఇద్దరు సోదరులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 నదుల నుంచి జలాలను, శ్రీలంక నుంచి సేకరించిన మట్టిని అయోధ్యకు తీసుకు తమ భక్తిని చాటుకుంటున్నారు.సోదరులైన రాథే శ్యాం పాండే, శబ్ధ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిపాల 70 ఏళ్లు వారు 1968 నుంచి 151 నదులు, 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుంచి జలాలు సేకరించారు.
శ్రీలంకలోని 16 ప్రాంతాల నుంచి మట్టి కూడా సేకరించారు.కాగా రామారాయం ఎప్పుడు అయితే నిర్మాణం ప్రారంభం అవుతుందో అప్పుడు తమ సేకరణలను రాముడికి సమర్పించాలనేది తమ కోరిక అని చెప్పారు.1968 నుండి 2019 వరకు కాలినడకన, సైకిలు, మోటారు సైకిలు, రైళ్లు, విమానాలలో ప్రయాణించి వాటిని సేకరించినట్టు అయన తెలిపారు.ఇవి ఆగష్టు 5న రాముడు జన్మస్థలమైన అయోధ్యకు సమర్పిస్తామని తెలిపారు.