హిందూ ధర్మ పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పౌర్ణమి రోజున పవనపుత్రుడు, అంజనీయతడైన హనుమంతుడు జన్మించారు.ఇక హనుమంతుడు జన్మించిన ఈ పవిత్రమైన రోజున హనుమాన్ జయంతిగా( Hanuman Jayanthi ) దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలను చేస్తారు.భక్తులు ఎన్నో రకాలుగా ఆయనను కొలుస్తూ ఉంటారు.అయితే శని దోష నివారణకు( Shani Dosham ) కొన్ని పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.హనుమాన్ జయంతి రోజున సుందరకాండ పారాయణం( Sundarakanda ) చేయడం చాలా మంచిది.
అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజున బెల్లం, నూనె లేదా నెయ్యిలో సింధూరం కలిపి దాన్ని ఆంజనేయ దేవాలయంలో సమర్పించాలి.అలా చేయడం వల్ల ఆ రామ భక్తుడి అనుగ్రహం మనకు లభిస్తుంది.
ఇలా చేస్తే ఆంజనేయుడు సంతోషించి మీరు కోరుకున్న ప్రతి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని హిందూ ధర్మాలు చెబుతున్నాయి.అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజున ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తిక్, ఓం చిహ్నం వేస్తే ప్రతికూల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు అని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడు ఆలయానికి వెళ్లి ఆవాల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించాలి.దీనివల్ల మీకు శుభం జరుగుతుంది.అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆలయంలో దీపం పెట్టి హనుమాన్ చాలీసాను ఐదు నుంచి 11 సార్లు పఠించాలి.పలు సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేయడం చాలా అవసరం.
ఇలా చేస్తే శని దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
హనుమాన్ జయంతి రోజున రావి చెట్టు ఆకులను 11 వరకు తీసుకొని శుభ్రం చేసి గంధం, కుంకుమతో ఆ ఆకులపై శ్రీరాముని పేరు రాసి దాన్ని మాలగా తయారు చేసుకుని హనుమంతుడికి ధరించాలి.ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.దీంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడి ఆలయంలో ఒక కాషాయ జెండాను సమర్పించాలి.ఇలా చేస్తే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు.
LATEST NEWS - TELUGU