తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు మరోసారి కుదుపుకు గురి చేస్తుంది.2017లో సంచలనం కలిగించిన ఈ డ్రగ్స్ వ్యవహారం.ప్రస్తుతం మళ్లీ తెరమీదకి వచ్చింది.డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ అనే విషయంపై ఈడీ విచారణ కొనసాగిస్తుంది.ప్రస్తుతం ఈ కథ మరో మలుపు తిరగుతోంది.తాజాగా సినిమా ప్రముఖులతో పాటు 11 మందికి ఈడీ సమన్లు జారీ చేసింది.
విచారణకు హాజరుకావాలని వెల్లడించింది.తాజాగా సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సుదీర్ఘంగా విచారించింది ఈడీ.అటు హాట్ బ్యూటీ ఛార్మీ కూడా ఈడీ విచారణకు హాజరైంది.
అటు నాలుగేండ్ల క్రితం డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తిరగతోడటం వెనుక కీలక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.
అతడు ఎవడో కాదు.నాటి డ్రగ్స్ కేసు కీలక నిందితుడు కెల్విన్.
ఎక్సైజ్ అధికారుల చార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు అతడిని గత ఆరు నెలలుగా విచారిస్తున్నారు.ఈ నేపథ్యంలో కెల్విన్ అప్రూవర్ గా మారినట్లు తెలుస్తోంది.
అతడు ఇచ్చిన సమాచారం మేరకు.ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది ఈడీ.ఈ నేపథ్యంలో సినిమీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా కెల్విన్ సెల్ ఫోన్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అందులో పలువురు టాలీవుడ్ నటీనటుల పేర్లు ఉన్నాయి.ఛార్మీ నంబర్ ను కెల్విన్.దాదా అని సేవ్ చేసుకున్నట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో కెల్విన్ కు దాదాకు మధ్యన జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ తీగలాగుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే తన ఆర్థిక వ్యవహారాలు చూసే చార్టెడ్ అకౌటెంట్ తో కలిసి ఛార్మీ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైంది.డ్రగ్స్ కేసుకు ముందు నుంచి తన బ్యాంక్ లావాదేవీల వివరాలను అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పూరీ, ఛార్మీ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు వీరిద్దరిని విచారించడం ఆసక్తి కలిగిస్తుంది.