గత 15 – 20 సంవత్సరాల నుండి ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది.పార్లమెంటు ఎన్నికల నుండి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు డబ్బు కట్టులు కుమ్మరించి ఓట్లను దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఓటర్లు కూడా తెలివి మీరి డబ్బులు ఎవరిస్తే వారి వద్ద తీసుకుని, చివరకు ఎవరికి వేయాలనుకుంటే వారికే వేస్తున్నారు.రెండు వైపుల డబ్బులు తీసుకుంటున్న వారు ఎటువైపు ఓటు వేస్తాడో ఎవరికి తెలియదు.
హోరా హోరీగా ఖర్చు పెట్టిన వారు కొద్ది తేడాతో ఒకరిపై ఒకరు గెలుస్తున్నారు.దాంతో ఓడిన వాడు లక్షలు, కోట్లల్లో నష్టపోయి కనుమరుగవుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు.సర్పంచ్ అభ్యర్థులు 30 నుండి 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన అనధికారిక లెక్కలు కూడా వారు చెబుతున్నారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తుల నుండి ఓటర్లు డబ్బులు తీసుకోవడం సర్వ సాదారణం అయ్యింది.తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి వార్డు నెంబర్ గా పోటీ చేసి ఓడిపోయాడు.
ఆ వ్యక్తి గెలుపుపై ధీమాతో చాలా డబ్బు ఖర్చు పెట్టాడు.ఇంటింటికి డబ్బును పంచి పెట్టాడు.

డబ్బులు వెద జల్లినా కూడా ఓడిపోవడంతో ఆ వ్యక్తి తాను ఎవరికి అయితే పంచానో ఆ జాబితాను చేతిలో పట్టుకుని ఇంటింటికి తిరిగి నేను ఓడిపోయాను, చాలా ఖర్చు చేశాను, అప్పులు చేసి నష్టపోయాను, దండం పెడతా, కాళ్లు మొక్కుతా నా డబ్బులు నాకు ఇవ్వండి అంటూ కోరుతున్నాడు.సూర్యపేట జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ సంఘటన వైరల్ అవుతుంది.ఓడిపోయిన అభ్యర్థి డబ్బులు వసూళ్లు చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఇలాగే చేయాలని, అప్పుడు కాని డబ్బులు తీసుకుని ఓట్లు వేయాలనుకునే, వేసిన ఓటర్లకు బుద్ది వస్తుంది.
ఓటును అమ్ముకోవద్దని ఎంతగా చెబుతున్నా కూడా ఓటర్లు మాత్రం సిగ్గు లేకుండా డబ్బులు తీసుకుని ఓటు వేయడం అత్యంత దారుణం.
డబ్బుకు ఓటును అమ్ముకోవడంను తప్పుపట్టే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి.ఇకపై ఓడిపోయిన ప్రతి అభ్యర్థి కూడా తాను ఇచ్చిన డబ్బును ఓటర్ల నుండి ముక్కు పిండి మరీ వసూళ్లు చేయాలి.







