ఇటీవల కాలంలో కుటుంబ బాధ్యతలను మరిచి జల్సాలకు అలవాటు పడి తమ జీవితాలను తామే నాశనం చేసుకునే యువత సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతుంది.చేతికి అంది వచ్చిన కొడుకు బాధ్యతను మరిచి చెడు వ్యసనాలకు బానిస మారితే ఆ తల్లిదండ్రులకు ఇక నరకమే.
వారి బాధను మాటలలో వర్ణించలేం అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఇలాంటి కోవలోనే చేతికి అంది వచ్చిన కొడుకు కుటుంబ బాధ్యతలు తీసుకుంటాడని ఎంతో ఆశపడ్డ తల్లిదండ్రులకు చివరికి నిరాశే మిగిలింది.
కొడుకు చెడు వ్యసనాల బారిన పడి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడంతో ఓపిక నశించిన తండ్రి గొడ్డలితో కన్న కొడుకుని నరికి చంపిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో నివాసం ఉండే సాయిలు, మల్లవ్వ అనే దంపతులకు రమేష్ (42) అనే యువకుడు సంతానం.అయితే రమేష్ ప్రతిరోజు తల్లిదండ్రులను వేధించేవాడు.కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన రమేష్ కన్న తల్లిదండ్రులను వేధించడంతో ఓపిక నశించిపోయిన తండ్రి సాయిలు గొడ్డలితో రమేష్( Ramesh ) ను నరికి చంపడంతో లింగాపూర్ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు( Police ) మృతదేహాన్ని పరిశీలించి విచారించగా.శనివారం ఉదయం తల్లిదండ్రులను రమేష్ వేధించడంతో తండ్రి సాయిలు క్షణికావేశంలో ఉదయం ఏడు గంటలకు ఇంట్లో ఉండే గొడ్డలితో రమేష్ తలపై బలంగా కొట్టడంతో రమేష్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, నిందితుడు సాయిలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







