Iron Deficiency : ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

మానవ శరీరంలో ఐరన్ ( Iron )పాత్ర ఎంతో కీలకమైనదని కచ్చితంగా చెప్పవచ్చు.శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అందడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.

 Iron Deficiency : ఐరన్ లోపంతో ఇబ్బంది పడ-TeluguStop.com

ఐరన్ లోపం కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఐరన్ లోపన్ని ఎలా గుర్తించాలి.

ఈ లోపాన్ని జయించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో ఐరన్ లోపం ఉంటే అలసట, తలనొప్పి, గుండె సమస్యలు,గర్భధారణ సమస్యలు,పిల్లలలో నెమ్మదిగా పెరుగుదల, జుట్టు రాలడం వంటి లక్షణాల ఆధారంగా ఈ లోపాన్ని గుర్తించవచ్చు.

Telugu Dark Chocolate, Iron Deficiency, Green Spinach, Iron, Magnesium, Pumpkin

ఇంతకీ ఐరన్ లోకాన్ని నివారించడానికి తీసుకునే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్స్ డేటా సెంటర్ ప్రకారం ముందు 100 గ్రాముల పచ్చి బచ్చలి ( Green spinach )కూరలో 2.7 మిల్లి గ్రాముల ఐరన్ ఉంటుంది.అంతేకాకుండా ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

ఇది ఇనుము శోషణాను పెంచుతుంది.రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా బచ్చలి కూర తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంలి గుమ్మడికాయలు కీలక పాత్ర పోషిస్తాయి.అలాగే 28 గ్రాముల గుమ్మడి గింజల్లో( pumpkin seeds ) 2.5 మిల్లీ గ్రాములు ఐరన్ ఉంటుంది.

Telugu Dark Chocolate, Iron Deficiency, Green Spinach, Iron, Magnesium, Pumpkin

అంతే కాకుండా ఇందులో విటమిన్ కె,, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉంటాయి.ఇది ఐరన్ లోపాన్ని దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఒక కప్పు వండిన బ్రోకలీలో 1 mg ఐరన్‌ ఉంటుంది.

అలాగే ఇందులో విటమిన్ సి కూడా ఉండడం వల్ల శరీరం ఐరన్ ను సులభంగా గ్రహించేలా చేస్తుంది.అంతే కాకుండా దీని ఉపయోగం క్యాన్సర్ ను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.28 గ్రాముల చాక్లెట్ లో 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది.దీంతో పాటు మెగ్నీషియం, కాపర్ కూడా ఉంటాయి.అలాగే రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్న వారు డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని దూరం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube