యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) స్పందించారు.దేవాలయంలో తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని తెలిపారు.
కొందరు ఆ ఫొటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని తెలిపారు.
ఈ క్రమంలోనే తాను ఎవరికీ తలవంచే వాడిని కాదన్న భట్టి ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదని స్పష్టం చేశారు.ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని తెలిపారు.
అయితే యాదాద్రి ఆలయంలో( Yadadri temple ) భట్టి చిన్న స్టూల్ పై కూర్చోవడం సోషల్ మీడియాలో వివాదంగా మారిన సంగతి తెలిసిందే.







