టాలీవుడ్ లో ప్రస్తుతం బెస్ట్ కపుల్ ఎవరంటే కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ అని చెప్పాలి.మిస్ ఇండియాగా మోడలింగ్ ప్రపంచం ని ఏలిన అమ్మాయి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబుతో లవ్ లో సినిమాలకి స్వస్తి చెప్పి కుటుంబ బాద్యథలకి పరిమితం అయిపోతుందని ఎవరు అనుకోని ఉండరు.
కాని నమ్రత అదంతా చేసి చూపించింది.తనకి భర్త, పిల్లలు తమ్మ మరో ప్రపంచం అవసరం లేదని ఫాషన్ ప్రపంచాన్ని చాలా ఈజీగా వదులుకుంది.
ఉత్తమ భార్యగా ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా తెచ్చుకున్న గుర్తింపు వెనుక నమ్రత పాత్ర ఉందంటే కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.
మహేష్ బాబు కూడా తన భార్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మహేష్ పై నమ్రత పీట్టిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
మహేష్ కి తాను ఎడిక్ట్ అయిపోయా అని ఒక పోస్ట్ పెట్టింది.ఈ ఒక్క కామెంట్ తోనే మహేష్ మీద ఆమెకి ఎంత ప్రేమ ఉంది అనే విషయం స్పష్టం చేసింది అంటూ ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.







