సక్సెస్ ఎవరికి ఉరికే రాదు.వచ్చిన సక్సెస్ ని కాపాడుకోవడానికి ప్రయత్నించే వారు కొందరైతే అవతల వాళ్లకు సక్సెస్ వస్తే ఓర్చు కోలేనివారు మరికొందరు.
అందుకే నిరాధారమైన విమర్శలు చేస్తూ నవ్వుల పాలవుతూ ఉంటారు.కనపడ్డ ప్రతి చెట్టు పై రాయి విసిరే నైజం పెరిగిపోతున్న ఈ తరుణంలో సెలబ్రిటీలపై అవాకులు చవాకులు పేలితే స్టార్డం లేదా పేరు వస్తుందని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ప్రతి సెలబ్రిటీపై ఏదో ఒక వెగటు పుట్టించే వార్తలు రాయడం మీడియాకు సోషల్ మీడియాకు బాగా అలవాటైపోయింది.
ఇక ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు.అలా ప్రతి సెలబ్రిటీపై ఏదో ఒక వార్త రాయడం వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నాం అనుకునేవారు కొందరైతే వికటాట్టహాసం చేసేవారు మరికొందరు.
ఇక ఈమధ్య కొంతమంది సెలబ్రిటీల విషయంలో వచ్చిన చేదు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిన్నటికి నిన్న దర్శకుడు కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ కన్నుమూసిన విషయం మన అందరికీ తెలిసిందే.ఆయన చావులో ప్రతి ఒక్కరికి కులం కుమ్ములాట తప్ప మరొకటి కనిపించకపోవడం ఎంతో బాధపడే విషయం.ఒక వ్యక్తి శిఖరం అంత ఎత్తుకు ఎదిగాడు అంటే దానికి కారణం అతడు సామర్థ్యం మాత్రమే అనే గుర్తుపెట్టుకోవాలి.
బ్రాహ్మణ విద్వేషి అని, కులాలకు, మతాలకు మాత్రమే అవకాశం ఇచ్చాడు అంటూ విశ్వనాథ పై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అంతులేదు.ఇదేదోవలో బాలసుబ్రమణ్యం కన్నుమూసినప్పుడు కూడా ఒక వర్గం వారు తీవ్రమైన ఆరోపణలు గుర్తించారు అని ఎవరిని పైకి ఎదగనివ్వలేదని తన పాటలను మాత్రమే బయటకు వచ్చేలా చూసాడంటూ వ్యాఖ్యానాలు చేశారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి కూడా ఇదే రకమైన అవమానం జరిగింది సినిమాలకు సాహిత్యాన్ని ఇచ్చాడని, అలా ఇండస్ట్రీ లో సాహిత్యం ఇచ్చే వారికి విలువ లేదని ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడేశారు.శవాల పైన పేలాలు ఏరుకోవడం తప్ప ఈ వ్యాఖ్యానాల్లో ఎలాంటి నిజం లేదు.పక్క వారు ఎదిగారు అనే అసూయ తప్ప మనలో ఉండే వైఫల్యాన్ని అధిగమించి ఎదగాలనే ఆలోచన ఏమాత్రం లేదు.మనం రాళ్ళు వేస్తున్న వారికి మనసు ఉంటుంది, కుటుంబం ఉంటుంది అని ఆలోచిస్తే బాగుంటుంది.