అధిక బరువుతో సతమతమవుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా బరువు తగ్గనే తగ్గడం లేదా? అయితే ఇప్పుడు చెప్పబోయే పొడిని వాడితే గనుక వారం రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనిస్తారు.సాధారణంగా ఆహారపు అలవాట్లు, ధీర్ఘకాలిక వ్యాధులు, పలు రకాల మందుల వాడకం, థైరాయిడ్, పోషకాల కొరత, శరీరానికి వ్యాయామం లేకపోవడం, మద్యపానం ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరుగి పోతుంటారు.
అయితే వెయిట్ గెయిన్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నట్టే.తగ్గడానికి బోలెడన్ని మార్గాలూ ఉన్నాయి.

అందులో ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ కూడా ఒకటి.అసలు ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేయాలి.? ఎలా వాడాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ అన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల అవిసె గింజలను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత రెండు స్పూన్ల సోంపు, రెండు స్పూన్ల జీల కర్ర, రెండు స్పూన్ల వాము తీసుకుని.వీటిని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు వేయించుకున్న అవిసె గింజలు, వాము, జీల కర్ర మరియు సోంపు నాలుగిటిని చల్లారనిచ్చి.అప్పుడు మిక్సీలో పొడి చేసుకోవాలి.
ఈ పొడిని ఒక గ్లాస్ జారులో స్టోర్ చేసి పెట్టుకోవాలి.ఇక దీనిని ఎలా వాడాలో కూడా చూసేయండి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో అర స్పూన్ లేదా ఒక స్పూన్ ఈ పొడిని యాడ్ చేసి మిక్స్ చేసి సేవించాలి.ఇందుకు మీకు కావాలీ అనుకుంటే తేనెలో కూడా కలుపుకోవచ్చు.
ప్రతి రోజు ఉదయాన్నే ఈ పరగడుపున ఈ పానియాన్ని తీసుకుంటే అతి ఆకలి తగ్గుతుంది.ఒంట్లో పేరుకు పోయిన కొవ్వు క్రమక్రమంగా కరుగుతుంది.
దాంతో మీరు చక్కగా వెయిట్ లాస్ అవుతాయి.

అలాగే ఈ పొడిని కలిపిన వాటర్‌తో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్య తగ్గు ముఖం పడతాయి.మరియు రక్త పోటు స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.