సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది.ఎండలు మాడు పగలగొడుతున్నాయి.
ఉదయం 11 గంటల తర్వాత బయట కాలు పెట్టాలంటేనే భయం వేస్తుంది.అయితే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తీవ్రమైన వేసవి వేడి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
వేసవి వేడిని తట్టుకునేందుకు కొన్ని కొన్ని పానీయాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూడా ఆ కోవకే చెందుతుంది.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు( Anise seeds ) వేసుకోవాలి.అలాగే చిన్న ముక్క పటిక బెల్లం( Alum jaggery ) కూడా వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పౌడర్ లో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి( Cardamom powder ), పావు టీ స్పూన్ మిరియాల పొడి( Pepper powder ), హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి మరియు పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ తయారు చేసుకున్న పొడి తో పాటు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), రెండు టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు మరియు చల్లటి నీరు వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది.వేసవి కాలంలో ఈ డ్రింక్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ముఖ్యంగా ఈ డ్రింక్ బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.సన్ స్ట్రోక్ బారిన పడకుండా రక్షిస్తుంది.బాడీ హీట్ ను మాయం చేస్తుంది.
వేసవి తాపాన్ని తీరుస్తుంది.అలాగే సమ్మర్ సీజన్ లో నీరసం, అలసట వంటివి విపరీతంగా వేధిస్తుంటాయి.
అయితే ఆయా సమస్యలకు ఇప్పుడు చెప్పుకున్న డ్రింక్ చెక్ పడుతుంది.బాడీని ఫుల్ ఎనర్జిటిక్ గా మారుస్తుంది.
అంతేకాకుండా ఈ డ్రింక్ ఒత్తిడిని తగ్గిస్తుంది.వేసవి వేడి వల్ల వచ్చే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.