ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో జీవనశైలి కారణంగా ఎదురయ్యే వ్యాధులలో ముఖ్యమైనది కొలెస్ట్రాల్( Cholesterol ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.కొలెస్ట్రాల్ వివిధ రకాల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఈ క్రమంలో కొలెస్ట్రాల్ సమస్యను ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించేందుకు వైద్యులు కూరగాయలు ఎక్కువగా తినమని చెబుతూ ఉంటారు.ఆరోగ్యంగా ఉంటూ వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు ఎప్పుడో చెబుతూ ఉంటారు.

ఇందులో భాగంగానే కూరగాయలు( Vegetables ) తినమని చెబుతూ ఉంటారు.ప్రత్యేకించి కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నప్పుడు గుండె వ్యాధులు తలెత్తకుండా ఉండేందుకు కొలెస్ట్రాల్ సమస్యలను నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు.క్రమం తప్పకుండా కూరగాయలు తప్పకుండా తింటూ ఉండాలి.ఈ కూరగాయలలో అతి ముఖ్యమైనది ఆకకారకాయ.కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఆకాకరకాయ( Akakarkaya ) అద్భుతంగా పనిచేస్తుంది.ఆకకారకాయతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకకారకాయ అనేది పూర్తి ఆకుపచ్చ రంగులో పై భాగంలో ముళ్ళలా ఉంటాయి.ఆకకారకాయ పూర్తిగా పౌష్టికాహారంతో నిండి ఉంటుంది.

ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.రుచికి ఇది కాస్త చేదుగా ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిది.ఆకకారకాయను డైట్‌లో చేర్చుకుంటే చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి.ఆకాకరకాయలో ఉండే కొన్ని పోషకాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.రోజు ఆకకారకాయను తింటే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.ఆకకారకాయలో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు సులభంగా దూరం చేసుకోవచ్చు.
వారానికి కనీసం మూడుసార్లు ఈ కూరగాయ తింటే ఇందులో పెద్ద ఎత్తున ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఈ కూరగాయలో విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది.ఆకకారకాయ తినడం వల్ల ప్రేవులు చాలా అద్భుతంగా శుభ్రం అవుతాయి.
దాంతో మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.







