నేటి కాలంలో వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నించే వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఉన్నారు అనడంలో సందేహమే లేదు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిని అధిక బరువు సమస్య విధిస్తోంది.
వ్యాయామలు చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సమయం పాటు ఒకే చోటు కూర్చుని ఉండడం, మద్యపానం ఇలా రకరకాల కారణాల వల్ల బరువు పెరుగుతారు.అయితే చాలా మంది బరువు తగ్గేందుకు తినడం మానేస్తారు.
కానీ, ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టేస్తుంటాయి.
వాస్తవానికి కొన్ని కొన్ని ఆహారాలు తినడం ద్వారా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
అలాంటి ఆహారాల్లో చిలకడదుంపలు ముందు వరసలో ఉంటాయి.ఇంగ్లీష్‌లో స్వీట్ పొటాటో అని పిలుచుకునే ఈ చిలకడదుంపలు మార్కెట్‌లో తక్కువ ధరకే విరి విరిగా లభిస్తుంటాయి.
కానీ, చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు.అయితే చిలకడదుంపల్లో విటమిన్ సీ, విటమిన్ ఈ, విటమిన్ బీ, పొటాషియం, ఐరన్, ఫైబర్‌తో పాటుగా బీటాకెరోటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, యాంథోసయానిన్స్ వంటి శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా బరువు తగ్గాలి అని భావించే ఖచ్చితంగా చిలకడదుంపలను డైట్‌లో చేర్చుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే.చిలకడదుంపల్లోని ఫైబర్ ఆకలికి తోడ్పడే హార్మోన్ల స్థాయిని తగ్గించి.కొలోసిస్టోకైనిన్ అనే హార్మోన్ స్థాయిని పెంచుతుంది.దాంతో ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.
ఇక కడుపు నిండినట్టు ఉంటే.వేరే ఆహారాలు తీసుకోవాలనే భావన తగ్గిపోతుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అందువల్ల, చిలకడదుంపలను ఉడికించి లేదా బేక్ చేసి ప్రతి రోజు తీసుకుంటే మంచిది.
అయితే చిలకడదుంపలను ఎప్పుడూ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసి తినరాదు.దీని వల్ల కేలరీలు పెరిగిపోతాయి.