ఎటువంటి ముడతలు లేకుండా ముఖ చర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అటువంటి స్కిన్ కోసం ప్రతి ఒక్కరు ఆరాటపడతారు.
కానీ కొందరు మాత్రమే అటువంటి చర్మాన్ని పొందగలుగుతారు.మీరు కూడా ఆ జాబితాలో ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
వైట్ అండ్ యూత్ ఫుల్ స్కిన్( Youthful skin ) ను పొందడానికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న ఆరెంజ్ పండు నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వైట్ ను మాత్రమే వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్( Orange juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.రెండు పదార్థాలు పూర్తిగా కలిసిన తర్వాత ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల అనేక బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి( Vitamin C ) పుష్కలంగా ఉంటుంది.ఇది పిగ్మెంటేషన్ మరియు డార్క్ స్పాట్లను తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.మీ చర్మాన్ని శుభ్రంగా, స్పష్టంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.అదే సమయంలో చర్మ ఛాయను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.అలాగే ఎగ్ వైట్ ఒక యాంటీ ఏజింగ్ పదార్ధంగా పనిచేస్తుంది.ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది.
సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.గుడ్డులోని తెల్లసొన సెబమ్ స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఫలితంగా మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.అంతేకాదు ఎగ్ వైట్ చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మెరిపిస్తుంది.
డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెడుతుంది.పిగ్మెంటేషన్ నుంచి బయటపడటానికి కూడా హెల్ప్ చేస్తుంది.
ఫైనల్ గా ఈ సింపుల్ మాస్క్ వల్ల మీరు వైడ్ అండ్ యూత్ ఫుల్ స్కిన్ గా పొందుతారు.