సాధారణంగా ఉదయం లేవగానే ఎక్కువ శాతం మంది టీ లేదా కాఫీ ని తాగుతుంటారు.ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్న వారు మాత్రం ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ ను తీసుకుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ అండ్ హెల్తీ జ్యూస్ ను కనుక ఖాళీ కడుపుతో తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య లాభాలను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక దానిమ్మ పండు తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.అలాగే అర కప్పు సీడ్ లెస్ గ్రీన్ గ్రేప్స్ తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన జ్యూస్ సిద్ధం అవుతుంది.
ఈ జ్యూస్ రుచి గా ఉండడమే కాదు ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు అందిస్తుంది.ముఖ్యంగా ఖాళీ కడుపుతో ప్రతి రోజు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మూత్రపిండాలు శుభ్రంగా మారతాయి.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. మెటబాలిజం రేటు పెరిగి వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది.రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మరియు చర్మం పై మొటిమలు ,మచ్చలు ఉంటే తొలగిపోయి స్పాట్ లెస్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.