మహానటి సావిత్రి ( Mahanati Savitri )గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.దేవదాసు, మిస్సమ్మ, మాంగల్యబలం, మాయాబజార్, గుండమ్మ కథ, సుమంగళి వంటి సినిమాల్లో సావిత్రి చూపించిన నటనకు తెలుగు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.
ఎక్స్‌పోజింగ్ చేయకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఏకైక నటి సావిత్రి అని చెప్పుకోవచ్చు.జెమినీ గణేషన్ ( Gemini Ganesan )కారణంగా ఈమె కెరీర్, పర్సనల్ లైఫ్ అర్థాంతరంగా ముగిశాయి కానీ లేదంటే ఆమె ఇంకా మరెన్నో అద్భుతమైన పాత్రలు చేసి మరింత ఆకట్టుకునేది.
సావిత్రి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్లతో చాలా సినిమాలు చేసింది.
తారక రామారావు( Taraka Rama Rao ) సావిత్రి పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉండేవారు.జెమినీ గణేషన్ ని పెళ్లి చేసుకోవద్దని రామారావు తో పాటు నాగేశ్వరరావు కూడా చెప్పి చూశారు.అయినా సావిత్రి మొండిగా అతడినే పెళ్లి చేసుకుంది.
తర్వాత జెమినీ గణేషన్ కి ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.ఆర్థికంగా కూడా బాగా నష్టపోయింది.
ఇతరుల మోసాలు, దురలవాట్లు కారణంగా ఆమె డబ్బులు అంతా పోగొట్టుకొని అప్పుల పాలయ్యింది.శారీరకంగా, మానసికంగా కూడా ఆమె బాగా దెబ్బతిన్నది.
ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయింది.
అయితే ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) బాగా మనస్తాపానికి గురయ్యారట.ఇదే విషయమై ఆమెను అడగగా సావిత్రి తాను బతికి ఏం చేయాలని ఏడ్చేసిందట.ఎంత ఓదార్చడానికి ట్రై చేస్తున్నా ఆమె అలానే చేస్తుండడంతో కోపం వచ్చి చెంప మీద బలంగా ఒకటి కొట్టారట.
అలా సావిత్రి మీద ఎన్టీఆర్ చేయి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వెల్లువెత్తాయి.ఈ సంగతి కాస్త బయటకు తెలియడంతో సినిమా ప్రేక్షకులు షాక్ అయ్యారు.ఎవరి మీద కూడా ఎన్టీఆర్ అప్పటిదాకా చేయి చేసుకోలేదు.ఎవరి పైన తిట్ల దండకం ఎత్తుకోలేదు.
అలాంటిది మహానటి సావిత్రిని ఆయన ఎందుకు అలా కొట్టాడు అని చాలామంది విస్మయాన్ని వ్యక్తపరిచారట.ఆ తర్వాత సావిత్రిని ఒక చెల్లిగా, ఫ్రెండ్ గా భావించి ఆమె మంచి కోసమే ఎన్టీఆర్ కొట్టినట్లు తర్వాత వార్తలు వచ్చాయి.
ఏది ఏదైనా సావిత్రి మానసికంగా కృంగిపోతూ 47 ఏళ్లకే చనిపోయింది.ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.